Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఒక్కరే. 17మంది ఇంటి సభ్యులు ఈ టైటిల్ కోసమే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్కో వారం ఒక్కొక్కరూ వెళ్లిపోతారు. కానీ ఈ 100 రోజుల ప్రయాణంలో ఎన్నో బంధాలు, అనుబంధాలు పంచుకుంటారు. ఎమోషన్ పండిస్తారు. వారి స్నేహాలు మనల్ని ఆకర్షిస్తాయి. బిగ్ బాస్ హౌస్ అంటేనే ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. వాటితోనే అది నడుస్తుంది.

అయితే కొందరు స్వతంత్రంగా ఒక్కరే ఆడితే.. ఇంకొందరు గ్రూపులతో నెట్టుకొచ్చి బలం పెంచుకుంటారు. కానీ జెన్యూన్ గా ఆడినవారే అంతిమంగా గెలుస్తారు.బిగ్ బాస్ సీజన్ 1లో శివబాలాజీ, ఆ తర్వాత కౌషల్, అభిజీత్, రాహుల్ సిప్లిగంజ్ ఇలా అందరు విజేతల్లోనూ తమ స్వతంత్రను, తమ నిబద్దతను ఖచ్చితంగా చివరి వరకూ నిలబెట్టుకున్న వారే విజేతలయ్యారు.
Also Read: Sarkaru Vaari Paata: ‘సర్కారు’ మోత మోగింది.. మహేష్ రికార్డుల వేట మొదలైంది !
తాజా బిగ్ బాస్ ఓటీటీలోనూ ‘బిందుమాధవి’ ఇదే చేస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలను దక్కించుకొని ఇప్పుడు నంబర్ 1గా నిలుస్తోంది. ఇక ఆమె తర్వాత గ్రూప్ ఇజంతో అఖిల్ తనను తాను దిగజార్చుకుంటున్నాడనే అపవాదు మూటగట్టుకుంటున్నాడు.

ఇన్నాళ్లు బిందుమాధవిని నానా ఇబ్బందులు పెట్టడానికి అఖిల్ ఒక గ్రూప్ ఫాం చేసి అజయ్, స్రవంతి, ఆషురెడ్డి, నటరాజ్ లతో కలిసి నానా రకాల ఆగడాలు చేశారు. కానీ ఇందులో ఒక్కరొక్కరు వెళ్లిపోతుండడం.. ఇక బిందుకు మద్దతుగా డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ ఎంట్రీతో బిగ్ బాస్ ఓటీటీ పూర్తిగా మారిపోయింది.
బిందుకు మద్దతుగా బాబా ఉండడం.. ఆమె ఇండివ్యూజవల్ గేమ్ తో ప్రేక్షకాదరణ పొందుతుండడాన్ని గమనించిన అఖిల్ ఇప్పుడు రూట్ మార్చాడు. తన గ్రూపులోని వారిని దూరం పెడుతూ స్వతంత్రను చాటుకునే పని చేస్తున్నాడు. దీంతో అటు గ్రూపులోని వారికి విలన్ అవుతూ.. ఇటు మారిన మనిషిని ఎవరూ నమ్మకపోవడంతో రెంటికి చెడ్డ రేవడిలా మారిపోతున్నాడు. వెన్నుపోటు అఖిల్ గా అతడి ఫ్రెండ్స్ దృష్టిలో మిగిలిపోయాడు.

మొత్తంగా బిగ్ బాస్ లో సగం పూర్తయ్యాక బాబా భాస్కర్ ఎంట్రీ తో అనూహ్య పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. అఖిల్ ఇలా ఊసరవెల్లిలా రంగులు మార్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా అతడిని నిజాయితీ లేమికి ఓట్లు పడడం కష్టంగా మారింది.
Also Read:Roja: ఎక్స్ట్రా జబర్దస్త్ లో హీరోయిన్ పరువు తీసిన రోజా.. జంతువుతో పోలుస్తూ?
Recommended Videos:
[…] Also Read: Bigg Boss Telugu OTT: వెన్నుపోటు అలకరాజా: బిందుమాధ… […]
[…] Pawan Kalyan Son Akira Nandan: తండ్రికి తగ్గ తనయుడు.. బ్లడ్ డొనేట్ చేసిన అకిరానందన్.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అకీరా నందన్ .. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ ల పెద్ద కొడుకు. ఈ ఇది చాలు అతను ఏం చేసినా వైరల్ కావడానికి. రేణుదేశాయ్ కూడా అకీరా గురించి సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తుండటంతో ఎప్పుడూ వైరల్ అవుతుంటారు. అకీరా కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. అకిరాకు చాలా విషయాల్లో తండ్రి పోలికలే వచ్చాయని అందరూ అంటుంటారు. ఆయన లాగే అకీరా నందన్ కూడా బాక్సింగ్, కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. […]
[…] Prashanth Neel: కేజీఎఫ్ చాప్టర్ 2 రికార్డుల మోత మోగిస్తోంది. ఏప్రిల్ 14న రిలీజైన కేజీఎఫ్ 2 అన్ని భాషల్లో సినిమా రికార్డులను బద్దలు కొట్టుకుంటూ పోతోంది. కన్నడ స్టార్ యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే హిదీ వెర్షన్ లో బాహుబలి, ఆర్ఆర్ ఆర్ రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ కాగా కీలక పాత్రల్లో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావురమేష్ నటించారు. […]