https://oktelugu.com/

Bigg Boss Telugu OTT: వెన్నుపోటు అలకరాజా: బిందుమాధవిపై నెగ్గేందుకు అఖిల్ చేస్తున్న పెద్ద స్కెచ్ ఇదే

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఒక్కరే. 17మంది ఇంటి సభ్యులు ఈ టైటిల్ కోసమే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్కో వారం ఒక్కొక్కరూ వెళ్లిపోతారు. కానీ ఈ 100 రోజుల ప్రయాణంలో ఎన్నో బంధాలు, అనుబంధాలు పంచుకుంటారు. ఎమోషన్ పండిస్తారు. వారి స్నేహాలు మనల్ని ఆకర్షిస్తాయి. బిగ్ బాస్ హౌస్ అంటేనే ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. వాటితోనే అది నడుస్తుంది. అయితే కొందరు స్వతంత్రంగా ఒక్కరే ఆడితే.. ఇంకొందరు గ్రూపులతో […]

Written By:
  • NARESH
  • , Updated On : April 23, 2022 / 12:25 PM IST
    Follow us on

    Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఒక్కరే. 17మంది ఇంటి సభ్యులు ఈ టైటిల్ కోసమే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్కో వారం ఒక్కొక్కరూ వెళ్లిపోతారు. కానీ ఈ 100 రోజుల ప్రయాణంలో ఎన్నో బంధాలు, అనుబంధాలు పంచుకుంటారు. ఎమోషన్ పండిస్తారు. వారి స్నేహాలు మనల్ని ఆకర్షిస్తాయి. బిగ్ బాస్ హౌస్ అంటేనే ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. వాటితోనే అది నడుస్తుంది.

    bindu madhavi, akhil

    అయితే కొందరు స్వతంత్రంగా ఒక్కరే ఆడితే.. ఇంకొందరు గ్రూపులతో నెట్టుకొచ్చి బలం పెంచుకుంటారు. కానీ జెన్యూన్ గా ఆడినవారే అంతిమంగా గెలుస్తారు.బిగ్ బాస్ సీజన్ 1లో శివబాలాజీ, ఆ తర్వాత కౌషల్, అభిజీత్, రాహుల్ సిప్లిగంజ్ ఇలా అందరు విజేతల్లోనూ తమ స్వతంత్రను, తమ నిబద్దతను ఖచ్చితంగా చివరి వరకూ నిలబెట్టుకున్న వారే విజేతలయ్యారు.

    Also Read: Sarkaru Vaari Paata: ‘సర్కారు’ మోత మోగింది.. మహేష్ రికార్డుల వేట మొదలైంది !

    తాజా బిగ్ బాస్ ఓటీటీలోనూ ‘బిందుమాధవి’ ఇదే చేస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలను దక్కించుకొని ఇప్పుడు నంబర్ 1గా నిలుస్తోంది. ఇక ఆమె తర్వాత గ్రూప్ ఇజంతో అఖిల్ తనను తాను దిగజార్చుకుంటున్నాడనే అపవాదు మూటగట్టుకుంటున్నాడు.

    bindu madhavi, akhil

    ఇన్నాళ్లు బిందుమాధవిని నానా ఇబ్బందులు పెట్టడానికి అఖిల్ ఒక గ్రూప్ ఫాం చేసి అజయ్, స్రవంతి, ఆషురెడ్డి, నటరాజ్ లతో కలిసి నానా రకాల ఆగడాలు చేశారు. కానీ ఇందులో ఒక్కరొక్కరు వెళ్లిపోతుండడం.. ఇక బిందుకు మద్దతుగా డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ ఎంట్రీతో బిగ్ బాస్ ఓటీటీ పూర్తిగా మారిపోయింది.

    బిందుకు మద్దతుగా బాబా ఉండడం.. ఆమె ఇండివ్యూజవల్ గేమ్ తో ప్రేక్షకాదరణ పొందుతుండడాన్ని గమనించిన అఖిల్ ఇప్పుడు రూట్ మార్చాడు. తన గ్రూపులోని వారిని దూరం పెడుతూ స్వతంత్రను చాటుకునే పని చేస్తున్నాడు. దీంతో అటు గ్రూపులోని వారికి విలన్ అవుతూ.. ఇటు మారిన మనిషిని ఎవరూ నమ్మకపోవడంతో రెంటికి చెడ్డ రేవడిలా మారిపోతున్నాడు. వెన్నుపోటు అఖిల్ గా అతడి ఫ్రెండ్స్ దృష్టిలో మిగిలిపోయాడు.

    bindu madhavi, akhil

    మొత్తంగా బిగ్ బాస్ లో సగం పూర్తయ్యాక బాబా భాస్కర్ ఎంట్రీ తో అనూహ్య పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. అఖిల్ ఇలా ఊసరవెల్లిలా రంగులు మార్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా అతడిని నిజాయితీ లేమికి ఓట్లు పడడం కష్టంగా మారింది.

    Also Read:Roja: ఎక్స్ట్రా జబర్దస్త్ లో హీరోయిన్ పరువు తీసిన రోజా.. జంతువుతో పోలుస్తూ?

    Recommended Videos:

    Tags