Bigg Boss Monal : ఇక త్వరలోనే బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్లోకి అడుగుపెట్టనుంది. ఈ సీజన్లో ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశపెడతారా అంటూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా చాలామంది ఫేమస్ అయ్యారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ షోలో సందడి చేసి ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. చిన్నచిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు అలాగే కమెడియన్స్ కూడా ఈ షో ద్వారా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా దాదాపు బయట మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే ఈ షో ద్వారా చాలామంది సినిమాలలో అవకాశాన్ని కూడా అందుకున్నారు. మరికొంతమంది మాత్రం బిగ్ బాస్ షో తర్వాత బయట కనుమరుగైపోయారు. అలాంటి వారిలో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ లో పాల్గొన్న మోనాల్ కూడా ఒకరు. మోనాల్ గజ్జర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఈమె తెలుగులో చాలా ఫేమస్.
Also Read : ఈ సోడాబుడ్డి కళ్ళద్దాల బ్యూటీని ప్రస్తుతం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…
సినిమాల కంటే కూడా ఈ చిన్నది బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. మోనాల్ గజ్జర్ తెలుగులో అల్లరి నరేష్ కు జోడిగా బ్రదర్ అఫ్ బొమ్మాలి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈమె సుడిగాడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.ఆ తర్వాత వెన్నెల 1 ½, ఒక కాలేజీ స్టోరీ, బ్రదర్ అఫ్ బొమ్మాలి వంటి సినిమాలలో నటించింది. కానీ సినిమాలలో కంటే మోనాల్కు బిగ్ బాస్ షో ద్వారా బాగా ఫాలోయింగ్ ఏర్పడింది. బిగ్ బాస్ షోలో ఈ చిన్నది తన ఆటతీరుతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తన అందంతో అందరిని కవ్వించింది. ముఖ్యంగా ఈ బ్యూటీ హౌస్ లో అఖిలతో ప్రేమాయణం సాధించి బాగా ఫేమస్ అయ్యింది. ఈ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత మోనాల్ తెలుగు సినిమాలలో అంతగా కనిపించలేదు. ఈ చిన్నది తెలుగుతోపాటు గుజరాతి సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. సినిమాలలో కనిపించకపోయినప్పటికీ మోనాల్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram