Tollywood Heroine : చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. యూట్యూబ్లో నవీన్ పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అలా వచ్చిన క్రేజ్ తో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని అందుకున్నాడు. ఈ సినిమాకు ముందు నవీన్ కొన్ని హిందీ సినిమాలలో కూడా నటించాడు. టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా నవీన్ పోలిశెట్టి నటించడం జరిగింది.
Also Read : మార్క్ శంకర్ కి ఇంకా పూర్తిగా నయం కాలేదా? ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే!
అలాగే తెలుగులో డి ఫర్ దోపిడీ, నేనొక్కడినే సినిమాలలో కూడా నవీన్ నటించిన. నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాతో హీరోగా మారాడు. ఇటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో నవీన్ తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరుకెక్కిన ఈ సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సొంతం చేసుకుంది.ఈ కథ మొత్తం నెల్లూరుకు చెందిన ఒక క్రైమ్ యూనివర్సిటీ సాగుతుంది. ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్త నటీనటులు ఉన్నారు. ఈ సినిమాకు స్వరూప ఆర్ఎస్జే దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కథను హీరో నవీన్ పోలిశెట్టి అందించడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అమ్మాయి ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది.
ఈ హీరోయిన్ పేరు శృతి శర్మ. మోడలింగ్ రంగంలో తన కెరియర్ మొదలుపెట్టిన శృతి శర్మ ఆ తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టింది. బుల్లితెర మీద కూడా ఈమె అలరించండి. బిగ్ బాస్ హిందీ రియాలిటీ షోలో కూడా శృతి శర్మ పాల్గొంది. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. హిందీలో ఈ చిన్నది పగలైట్ అనే సినిమాలో నటించింది. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరమండీ డైమండ్ బజార్ సినిమాలో కూడా శృతి శర్మ నటించడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
View this post on Instagram