Bigg Boss Keerthi Engagement: బిగ్ బాస్ ఫేమ్ సీరియల్ నటి కీర్తి భట్ నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో ఆదివారం ఈ వేడుక నిర్వహించారు. కీర్తి భట్ ఎంగేజ్మెంట్ కి బుల్లితెర నటులు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్, యాంకర్స్ హాజరై సందడి చేశారు. నూతన జంటను ఆశీర్వదించారు. నటుడు, దర్శకుడు విజయ్ కార్తీక్ ని కీర్తి భట్ కొన్నాళ్లుగా ప్రేమిస్తుంది. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. ఇటీవల పరిశ్రమలోని తన సన్నిహితులను ఎంగేజ్మెంట్ వేడుకకు రావాలని ఆహ్వానించారు.
జానకి కలగనలేదు సీరియల్ సెట్ కి వెళ్లి ప్రియాంక సింగ్, అమర్ దీప్ చౌదరిలను కీర్తి, విజయ్ ఇన్వైట్ చేశారు. ఈ వీడియోను ప్రియాంక సింగ్ తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేయగా కీర్తి పెళ్లి విషయం బయటకు వచ్చింది. ఆగస్ట్ 21న ఎంగేజ్మెంట్ జరిగిన నేపథ్యంలో త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇక కీర్తి భట్ అభిమానులు ఆమెకు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు.
కన్నడ అమ్మాయి అయిన కీర్తి భట్ తెలుగులో మనసిచ్చి చూడు, కార్తీక దీపం సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం ఆమె మధురానగరిలో సీరియల్ లో మెయిన్ లీడ్ చేస్తుంది. కీర్తి భట్ అనాథ. ఆమె కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆ ప్రమాదంలో కీర్తి కూడా ఉంది. అయితే ఆమె మాత్రం ప్రాణాలతో బయటపడింది. పేరెంట్స్ మరణించాక కీర్తి నిరాదరణకు గురైందట. చుట్టాలు పక్కాలు చేరదీయకపోయినా కీర్తి స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగింది.
బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న కీర్తి ఫైనల్ కి చేరడం విశేషం. హౌస్లో ఆమె గట్టి పోరాటపటిమ కనపరిచింది. ఎదుటివారు ఎవరైనా తప్పు చేశారంటే ఆమె ప్రశ్నించేది. హౌస్లో కీర్తి వేలికి గాయమైంది. షో ముగిసే వరకు కూడా ఆమె వేలి గాయం మానలేదు. అలానే గేమ్లో పాల్గొనేది. బిగ్ బాస్ ఆమెకు మంచి ఫేమ్ తెచ్చింది. ఇక విజయ్ చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందినవాడని సమాచారం. సాఫ్ట్వేర్ ఎంప్లొయ్ అయిన విజయ్ నటనపై మక్కువతో పరిశ్రమకు వచ్చాడు. హీరోగా దర్శకుడిగా చిత్రాలు చేశాడు.