https://oktelugu.com/

Inaya Sultana: వాళ్ళలా చేస్తే నేను కూడా స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని… కృతి శెట్టి, శ్రీలీలపై బిగ్ బాస్ ఇనయా షాకింగ్ కామెంట్స్

కృతి శెట్టి, శ్రీలీల వంటి వారు కూడా టీనేజ్ లోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కానీ నేను 22 ఏళ్లకు సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యాను. వాళ్ళతో పోల్చుకుంటే నేను 7 ఏళ్ళు వృధా చేసుకున్నాను.

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2023 / 06:40 PM IST

    Inaya Sultana

    Follow us on

    Inaya Sultana: బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయమక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా ఆకట్టుకుంది. అయితే ఆమె బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో సినిమా అవకాశాలు దక్కించుకోవాలి అని అనుకుంది. కానీ అవకాశాలు అంతగా రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇనయా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇనయా సుల్తానా మాట్లాడుతూ .. సినిమా ఇండస్ట్రీలో కొంత మంది అమ్మాయిలు టీనేజ్ లోనే అడుగు పెడుతున్నారు. ఆ క్రమంలోనే స్టార్ హీరోయిన్లుగా క్రేజ్ రాబడుతున్నారు. 16-17 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్లు గా ఎదుగుతున్నారు.

    కృతి శెట్టి, శ్రీలీల వంటి వారు కూడా టీనేజ్ లోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కానీ నేను 22 ఏళ్లకు సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యాను. వాళ్ళతో పోల్చుకుంటే నేను 7 ఏళ్ళు వృధా చేసుకున్నాను. శ్రీలీల, కృతి శెట్టిలా చేసి ఉంటే ఇండస్ట్రీలో నా లైఫ్ మరోలా ఉండేది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మనం 60 ఏళ్లకు మించి బతకడం కష్టం. ఎప్పుడు పోతామో తెలియదు. ప్రస్తుతం నా వయసు 25 ఏళ్లు. దేవుడి దయ ఉంటే ఇంకో పాతికేళ్ళు బతుకుతా. అందుకే ఇప్పుడున్న సమయాన్ని ఆనందంగా గడుపుతున్నా అని చెప్పింది ఇనయా.

    సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేసే ఫోటోలు జస్ట్ శాంపిల్ మాత్రమే .. ఇంకా నా దగ్గర మస్త్ షేడ్స్ ఉన్నాయి అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఆమె బిగ్ బాస్ తర్వాత అవకాశాల కోసం చాలా ఆఫీసులు తిరిగాను. కానీ ఒక్క ఆఫర్ కూడా రాలేదని చెప్పింది.

    అలాంటి సమయంలో కూడా ఎలాంటి డిప్రెషన్ లోకి వెళ్లలేదు. పరిశ్రమలో స్థిరపడాలని వచ్చాను. మొదట్లో అవకాశాల కోసం ఆడుకున్నా ఫలితం దక్కలేదని ఇనయా వాపోయింది. ఇనయా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. కాగా బిగ్ బాస్ హౌస్లో ఆర్జే సూర్యతో ఇనయా రొమాన్స్ చేసింది. అతడు అంటే క్రష్ అని ఓపెన్ గా ప్రకటించింది.