https://oktelugu.com/

బిగ్ బాస్ మొదలైంది..ఎవరిని పిలుస్తున్నారంటే?

తెలుగు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయే తరుణం మళ్లీ రాబోతోంది. అందరు ప్రేక్షకులు ఆసక్తిగా చూసే బిగ్ బాస్ సీజన్ 5కి రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు స్టార్ మా టీవీ బిగ్ బాస్ 5 సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ల కోసం వేట మొదలుపెట్టింది. బిగ్ బాస్ లో ఇప్పటివరకు సంవత్సరానికి ఒకటి చొప్పున 4 సీజన్లు విజయవంతంగా ముగిశాయి. ఇప్పుడు 5వ సీజన్ కి ముహూర్తం ఖరారైంది. నిజానికి మే చివరి వారంలోనే ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 5, 2021 / 09:45 PM IST
    Follow us on

    తెలుగు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయే తరుణం మళ్లీ రాబోతోంది. అందరు ప్రేక్షకులు ఆసక్తిగా చూసే బిగ్ బాస్ సీజన్ 5కి రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు స్టార్ మా టీవీ బిగ్ బాస్ 5 సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ల కోసం వేట మొదలుపెట్టింది.

    బిగ్ బాస్ లో ఇప్పటివరకు సంవత్సరానికి ఒకటి చొప్పున 4 సీజన్లు విజయవంతంగా ముగిశాయి. ఇప్పుడు 5వ సీజన్ కి ముహూర్తం ఖరారైంది. నిజానికి మే చివరి వారంలోనే ఈ సీజన్ కోసం ఇంటర్వ్యూలు , కంటెస్టెంట్ల వేట మొదలుపెట్టారు. కానీ కరోనా వల్ల ఆగిపోయింది.

    ప్రస్తుతం కరోనాతో జూన్ లో ఈ సీజన్ ను మొదలు పెట్టాలని భావిస్తున్నా.. ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ సీజన్ లో పాల్గొనే సెలబ్రెటీల లిస్టు ఒకటి తయారు చేసింది మా టీవీ. ఇప్పుడు వాళ్లకు జూమ్ ద్వారా ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ 5లో గాయని మంగ్లీ, యాంకర్ రవి, వర్ధమాన హీరోయిన్లు, గ్లామర్ నటీమణులు, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, తదితరులు ఉన్నట్టు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    ప్రస్తుతం మాటీవీ రోజుకు ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూలు చేస్తోందట.. మరో వారం రోజుల్లో ఓ ఫైనల్ లిస్టును తయారు చేసే అవకాశం కనిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ప్రవేశపెట్టే ముందు మాత్రమే వారి లిస్ట్ బయట పెడుతారట.. అంతకుముందు కంటెస్టెంట్లు అందరినీ హోంక్వారంటైన్ లో 15రోజులు పాటు ఉంచుతారట.. ముందుగానే ఈ ప్రాసెస్ ను మొదలుపెట్టాలని యోచిస్తున్నట్టు తెలిసింది.