
నటరాజ్ మాస్టర్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ మధ్య బిగ్ బాస్ పుణ్యమా అంటూ కాస్త అందరి దృష్టిలో పడ్డాడు. కొరియోగ్రాఫర్‌గా అనేక సినిమాలకు పనిచేసిన నటరాజ్ మాస్టర్.. ఓంకార్ ఆట డాన్స్‌తో పాపులర్ అయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఇంటర్వ్యూలకే పరిమితం అయిన ఆయన.. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్ ప్రైజ్ చేశారు.
బిగ్ బాస్ హౌస్ లోకి 12వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన నటరాజ్ మాస్టర్.. క్లిష్టమైన పరిస్థితుల్లో ఇష్టం లేకకపోయినప్పటికీ తన భార్య నీతూ బలవంతంపై బిగ్ బాస్‌కి రావాల్సి వచ్చింది. కారణం ఏంటంటే నటరాజ్ మాస్టర్ భార్య నిండు గర్భిణి. తన డాన్స్ గ్రూప్‌లో డాన్సర్‌గా పనిచేసే నీతూ అనే డాన్సర్‌ని 2009లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు నటరాజ్ మాస్టర్. ఏడేళ్ల పాటు నటరాజ్ మాస్టర్ని ప్రేమించి చివరికి తన ప్రేమను గెలుచుకుంది నీతూ.
నీతూ నిండుగర్భిణి అని అందరికి తెలుసు. బిగ్ బాస్ ఆరంభ ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్ తో పాటు నీతూ కూడా వచ్చింది. మాకు ఓ బిడ్డ పుట్టాలని ఎంతో ఆశపడ్డాం. సరిగ్గా బాబు పుట్టబోతోన్నాడనే వార్త తెలిసినక్షణంలోనే బిగ్ బాస్ ఆఫర్ కూడా వచ్చింది. బాబు పుట్టినప్పుడు నేను అక్కడే ఉండాలి.. బాబును ఎత్తుకోవాలి అని అనుకున్నాను.. నా భార్య మాత్రం నన్ను ఫోర్స్ చేసి ఇక్కడకు పంపించింది.. అంటూ నటరాజ్ మాస్టర్ తన భార్యని తలుచుకుని బిగ్ బాస్ స్టేజ్‌పై ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.
ఇలాంటి పరిస్థితుల్లో నీతూని వదిలి వెళ్లలేక నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ ఆఫర్‌ని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే నీతూ ఆయనకి ధైర్యం చెప్పి.. బిగ్ బాస్ టైటిల్‌తో తిరిగి ఇంటికి రావాలని చెప్పడంతో.. నటరాజ్ మాస్టర్ తన భార్య అందించిన సపోర్ట్‌తో బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు.
ఈ మధ్యనే నటరాజ్ మాస్టర్ భార్య నీతూ సీమంతం ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్‌కి బుల్లితెర తారలు నవీన, శ్రీవాణి, అంజలి పవన్, జ్యోతి రెడ్డి తదితరులు వచ్చి సందడి చేశారు. తాజాగా సీమంతం జరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్ ప్రైజ్ చేసిన నటరాజ్ మాస్టర్ కి ఇప్పుడు బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చాడట. తన భార్య సీమంతం ఫొటోస్ పంపించి నటరాజ్ మాస్టర్ ని బిగ్ బాస్ భావోధ్వేగానికి గురయ్యలా చేశాడు అని వినికిడి.