Bigg Boss 7 Telugu: ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో సీజన్ 7 మొదలుపెట్టిన బిగ్ బాస్ నిజంగా అన్ని ఉల్టా పుల్టా చేస్తున్నాడు. ట్విస్టుల మీద ట్విస్టులతో అటు కంటెస్టెంట్స్ ను ఇటు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో నిన్న బిగ్ బాస్ హౌస్ లో 8వ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హౌస్ మేట్స్ ని సమావేశపరిచిన బిగ్ బాస్ ఇమ్యూనిటీ పవర్ గురించి ఇచ్చిన ట్విస్ట్ అందరికీ ఫ్యూజు పోయేలా చేసింది.
పొద్దున 11:45 నిమిషాలకి అందర్నీ సమావేశపరిచిన బిగ్ బాస్ ఆట సందీప్ కు హౌస్మెట్గా కన్ఫామ్ చేస్తూ ఓ లెటర్ పంపించారు. పవర్ అస్త్ర ను గెలిచి ఇంటి సభ్యుడిగా మారిన విషయాన్ని కన్ఫామ్ చేస్తూ మారుతి సుజుకి కన్ఫర్మేషన్ కీ ని గార్డెన్ ఏరియాలో ఉన్న మారుతి సుజుకి జోన్ లోని హోల్డర్ కి తగిలించమని బిగ్ బాస్ లెటర్లో తెలియపరిచారు. ఇదే విషయాన్ని ఇంటి సభ్యులకు చదివి వినిపించిన ఆట సందీప్ తన ఫోటోతో ఉన్న మారుతి సుజుకి కన్ఫర్మేషన్ వాల్ కి ఉన్న హ్యాంగర్ కీ తగిలించారు. అయితే అప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ ఆ తరువాత అంటే 2 గంటల ప్రాంతంలో అసలు విషయం చెప్పినప్పుడు అతని మొహంలో కనిపించలేదు.
అందరినీ సమావేశపరిచిన బిగ్ బాస్ “సందీప్ మీరు పవర్ అస్త్ర గెలవడంతో పాటు ఐదు వారాల ఇమ్యూనిటీని సొంతం చేసుకొని.. ఈ సీజన్ లో మొట్టమొదటి ఇంటి సభ్యుడు అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు”అని అన్నాడు. అంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత పెట్టిన మెలికే ఇమ్యూనిటీ కాన్సెప్ట్ను ఉల్టా పుల్టా చేసింది.
బిగ్ బాస్ అభినందించాడు కదా అని ఇంటి సభ్యులందరూ చప్పట్లు కొట్టి తమ హర్షం వ్యక్తం చేశారు. అదిగో అప్పుడే అసలు ట్విస్ట్ ని బిగ్ బాస్ రివిల్ చేశాడు…ఇమ్యూనిటీ అనేది మీకు శాశ్వతమైనది కాదు…అందుకే మీకోసం అదిగో అక్కడ ఆ బ్యాటరీని ఏర్పాటు చేయడం జరిగింది.. దాన్ని ఎన్ని రోజులు అయితే మీరు చార్జిలో ఉంచగలుగుతారు అన్ని రోజులు మీరు సేఫ్ గా ఉన్నట్టే…దాన్ని చార్జ్ లో ఉంచడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది.. అన్న బిగ్ బాస్ మాటలకి పాపం ఆట సందీప్ ఏం చెప్పాలో అర్థం కాక ..ఓకే బిగ్ బాస్ అని సమాధానం ఇచ్చాడు.
ఇంతకీ ఆ బ్యాటరీ చార్జ్ ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయి లేదు…ఇంట్లో ఇకనుంచి బిగ్ బాస్ హౌస్ లో జరిగే టాస్క్ లలో ఆట సందీప్ పర్ఫామెన్స్ , ఎంటర్టైన్మెంట్ ,పార్టిసిపేషన్ ఇన్ హౌస్, ఫియర్లెస్నెస్, ఒరిజినాలిటీ .. వీటిని ఆధారంగా తీసుకొని ఈ బ్యాటరీ యొక్క చార్జ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని బిగ్ బాస్ తెలియపరచాడు. అంతేకాకుండా ఆట సందీప్ ఇక హౌస్ మేట్ గా ఉంటాడా.. లేక తిరిగి కంటెస్టెంట్ గా మారుతాడా అనేది కూడా అతని చేతుల్లోనే ఉంటుంది అని తేల్చి చెప్పాడు. ఈ ట్విస్ట్ అక్కడున్న ఎవరు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో షాక్ అయ్యారు