Homeఎంటర్టైన్మెంట్క్రేజీ హీరోయిన్ కి ఘోర రోడ్డు ప్రమాదం !

క్రేజీ హీరోయిన్ కి ఘోర రోడ్డు ప్రమాదం !

Big Boss Fame Yashika Anand

బిగ్‌బాస్‌ ఫేమ్‌ యాషికా ఆనంద్‌ కి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడులో చెంగల్‌ పట్టు జిల్లా మామల్లపురంలో డివైడర్‌ ను యాషిక కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆమెతో సహా మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. ఇక యాషికా స్నేహితురాలు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వల్లిశెట్టి భవాని ఈ ప్రమాదంలో మృతి చెందటం బాధాకరమైన విషయం.

ఇంతకీ ఈ ప్రమాదానికి కారణం మద్యం మత్తులో వేగంగా కారు నడపడమేనట. కేవలం ఆజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు కూడా నిర్ధారించారు. ఇక తీవ్రంగా గాయపడిన యాషికా ఆనంద్‌ ను చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

ప్రస్తుతం యాషిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. యాషికా ఆనంద్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. మొదట ఫ్యాషన్ మోడల్‌ గా కెరీర్ ను స్టార్ట్ చేసి… ఆ తర్వాత టీవీ నటిగా సక్సెస్ అయి… 2016లో దురువంగల్ పత్తినారుతో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.

ముఖ్యంగా అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు చిత్రాలతో ఆమె క్రేజీ స్టార్‌ గా మారింది. బిగ్ బాస్ 2 తమిళ్ సిరీస్‌ లో కూడా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ఇక యాషిక పంజాబీ ఫ్యామిలీలో పుట్టారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular