
Rohini Noni: అత్యంత ప్రజాదరణ పొందిన బిగ్ బాస్ షో ఎంతో మంది జీవితాలను మార్చేసింది. ఈ షో కి నామ మాత్రం పేరు ఉండేవాళ్ళు బిగ్ బాస్ తర్వాత మంచి స్టార్ స్టేటస్ ని పొందారు. మంచి ఆఫర్స్ అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ తరహాలో పెద్ద బంగ్లా, కార్లు కొనుగోలు చేస్తున్నారు. అలా తాజాగా ఈ కోవలోకి బిగ్ బాస్ ఫేమ్ , కమెడియన్, బుల్లితెర నటి రోహిణి కూడా అదే జాబితాలోకి చేరింది.
బుల్లి తెర లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ పేరు తో మంచి క్రేజ్ సంపాదించుకుంది రోహిణి(Rohini Noni). దాని తర్వాత అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లో పాల్గొని తన జీవితాన్ని మార్చుకుంది. ఉన్నది నాలుగు వారాలైనా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా ఇప్పుడు ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, డ్రామా కంపెనీ లో పాల్గొంటూ సందడి చేస్తుంది.
ఇదిలా ఉండగా కొద్ది నెలల క్రితం రోహిణి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసి ఎప్పటికప్పుడు వీడియోలు పెడుతూ యూట్యూబ్ లో తెగ సందడి చేస్తుంది. తాజా గా యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టి తన సంతోషాన్ని పంచుకుంది. రోహిణి మణికొండలో డూప్లెక్స్ హౌస్ ని కొనుగోలు చేసింది.
తన చిరకాల కోర్కె అయిన సొంతింటి కలను సాకారం చేసుకుని తన ఆనందాన్ని హోమ్ టూర్ రూపంలో యూట్యూబ్ లో పెట్టింది. అంతే కాకుండా హౌస్ మొత్తాన్ని రీ మోడలింగ్ చేయించి అందంగా తీర్చి దిద్దుతాని ప్రేక్షకులకి చెప్పుకొచ్చింది.