Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Maanas: బిగ్ బాస్ 5 మానస్ ను అభినందించిన తెలంగాణ మినిస్టర్... రీజన్...

Bigg Boss Maanas: బిగ్ బాస్ 5 మానస్ ను అభినందించిన తెలంగాణ మినిస్టర్… రీజన్ ఏంటంటే ?

Bigg Boss Maanas: బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ షోకి అభిమానులు ఉన్నారు. తెలుగులో కూడా ‘బిగ్‌బాస్‌’ కి మంచి ఆదరణ లభించింది. ఇప్పటికే ఐదు సీజన్స్‌ పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే ఆరో సీజన్‌కి రెడీ అవుతోంది. కాగా ఇటీవల పూర్తయిన ఐదో సీజన్ ప్రేక్షకులను మరింత రంజింప చేసిందని చెప్పాలి. కాగా హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న మానస్ తన ఆటతీరుతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని టాప్ 5 లో నిలిచాడు. తనదైన ఆటతీరుతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మానస్. ఈ ఫేమ్ తో సినిమాల్లో కూడా మంచి అవకాశాలను కూడా అందుకుంటున్నట్లు సమాచారం అందుతుంది.

bigg boss fame maanas meet telangana minister talasani sreenivas yadav

తాజాగా బిగ్ బాస్ షో లో ఆయన ప్రదర్శనకు మెచ్చి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… బిగ్ బాస్ షో లో మానస్ ఆట తీరు చాలా బాగుంది. ఆయన ప్రవర్తన ఎంతో హుందాగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు సంపాదించుకుంటాడు. ఆల్ ది బెస్ట్ టు మానస్ అన్నారు.

అనంతరం మానస్ మాట్లాడుతూ… బిగ్ బాస్ లో నా ప్రయాణం ఇంత బాగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని చెప్పాడు. ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను హౌస్ లో ఉన్నప్పుడు నన్ను ఎంతో సహకరించి, ఇప్పుడు నన్ను ఆశీర్వదించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు అని మానస్ అన్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular