Bigg Boss Telugu 8 :: బిగ్ బాస్ రియాలిటీ షో పై చాలా వ్యతిరేకత ఉంది. సాంప్రదాయవాదులు బిగ్ బాస్ షోని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ షో రద్దు చేయాలని కోర్టుల్లో పలుమార్లు పిటీషన్లు వేయడమైంది. బిగ్ బాస్ షో పై కొన్ని ఆంక్షలు అయితే విధించారు కానీ, పూర్తిగా రద్దు చేయలేకపోయారు. ప్రతి సీజన్ ఆరంభానికి ముందు నిరసనలు వ్యక్తం అవుతాయి. ఒకసారి బిగ్ బాస్ వ్యతిరేకులు హోస్ట్ నాగార్జున ఇంటికి ముట్టడించే ప్రయత్నం చేశారు. సిపిఐ నారాయణ బిగ్ బాస్ షో పై పలుమార్లు ఆరోపణలు చేశారు.
ఒకే ఇంట్లో అమ్మాయిలు, అబ్బాయిలు ప్రపంచంతో సంబంధం లేకుండా కలిసి ఉండటం. ఆడ మగ తేడా లేకుండా గేమ్స్, టాస్క్స్ పెట్టడం. కంటెస్టెంట్స్ మధ్య లవ్ స్టోరీలు, రొమాన్స్.. వంటి విషయాలు మన సంస్కృతిని దెబ్బతీస్తున్నాయి. యువత మీద బిగ్ బాస్ ప్రతికూల ప్రభావం చూపుతుంది అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే బిగ్ బాస్ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. బిగ్ బాస్ అత్యధిక టీఆర్పీ రాబడుతున్న షో. అందుకే కోట్లు వెచ్చింది స్టార్ మా బిగ్ బాస్ రియాలిటీ షోని ప్రసారం చేస్తుంది.
కాగా సీజన్ 8 కి కూడా రంగం సిద్ధమైంది. జులై 21న బిగ్ బాస్ తెలుగు 8 ప్రోమో విడుదల చేశారు. హోస్ట్ నాగార్జున తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో లోగో షేర్ చేశారు. మిమ్మల్ని నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేసేందుకు తిరిగి వచ్చేస్తున్నాం అని కామెంట్ జోడించారు. బిగ్ బాస్ తెలుగు 8లో చాలా కలర్ఫుల్ గా ఉంది. లోగోలో మేకర్స్ ఈ సీజన్ కి సంబంధించిన హింట్స్ ఇచ్చారు. వాటిని క్రాక్ చేస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి. సీజన్ 8 ప్రారంభం నేపథ్యంలో బిగ్ బాస్ రివ్యూవర్, మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఆసక్తికర వీడియో చేశాడు.
ఈ వీడియోలో సీజన్ 8 కంటెస్టెంట్స్ ఎవరు? ఈసారి షో ఎలా డిజైన్ చేశారు? అసలు బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుంది? అనే విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ డిజైన్ గురించి చెప్పిన కొన్ని అంశాలు షాకిస్తున్నాయి. చివరికి బాత్ రూమ్స్ లో కూడా కంటెస్టెంట్స్ మీద బిగ్ బాస్ పరిశీలన ఉంటుందట. ఆదిరెడ్డి ప్రకారం… బాత్ రూమ్స్ లో సీక్రెట్ మైక్స్ పెడతారు. అక్కడ మాట్లాడినా కూడా బిగ్ బాస్ మేకర్స్ వింటారు.
సాధారణంగా కంటెస్టెంట్స్ బాత్ రూమ్ కి మైక్ తీసుకెళ్లరు. అయినప్పటికీ సీక్రెట్ మైక్స్ సహాయంతో కంటెస్టెంట్స్ మాటలు వింటారట. కనిపించే కెమెరాలు మాత్రమే కాకుండా బిగ్ బాస్ హౌస్లో అనేక సీక్రెట్ కెమెరాలు ఉంటాయట. సీక్రెట్ కెమెరాలు, మైక్స్ సహాయంతో ప్రతి మూలన జరిగే సంఘటనలు, ప్రతి కంటెస్టెంట్ మాటలను రికార్డు చేస్తారట. కాబట్టి హౌస్లో ఎక్కడ ఉన్నా.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆచితూచి మాట్లాడాలి. పద్దతిగా ప్రవర్తించాలి.
ఇక ప్రచారంలో ఉన్న లిస్ట్ ప్రకారం.. బంచిక్ బబ్లు, హేమ, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్, నరేష్, సురేఖావాణి, సోనియా సింగ్, అంబటి రాయుడు, వేణు స్వామి, రీతూ చౌదరి, విష్ణుప్రియ, కుమారి ఆంటీ, బర్రెలక్కతో పాటు మరికొందరు సెలెబ్స్ సీజన్ 8లో పాల్గొంటున్నారట. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారంలో బిగ్ బాస్ తెలుగు 8 లాంచ్ అయ్యే అవకాశం కలదు. త్వరలో తేదీ పై స్పష్టత రానుంది.
Web Title: Bigg boss ex contestant adireddy made an interesting video in the background of the start of season 8
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com