https://oktelugu.com/

Bigg Boss 7 Telugu : ఎపిసోడ్ హైలెట్స్: ఈ వారం నో ఎలిమినేషన్, నాగ్ నిర్ణయంతో ఆ ఇద్దరు సేఫ్!

యావర్ తన ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేశాడు. ఈ కారణంగా ఎలిమినేషన్ రద్దు అయ్యింది. ఎవిక్షన్ పాస్ కి మరలా పోటీ జరుగుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2023 / 10:41 AM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజు కి ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే పది మంది హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయారు. కాగా హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. దీనితో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారిన అంశం.దీంతో ఆదివారం ఎపిసోడ్ పై ఆసక్తి నెలకొంది.

    హోస్ట్ నాగార్జున… నామినేషన్ లో ఉన్న వాళ్ళు అందరూ లేచి నిలబడాలని నాగార్జున చెప్పారు. నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ టెన్షన్ పడుతూ లేచి నిలబడ్డారు. ఇక ప్రశాంత్ ని పిలిచి స్టోర్ రూంలో ఉన్న బాటిల్ తీసుకురమ్మని ప్రశాంత్ తో చెప్పారు. అయితే ఆ సీసా పగలకొట్టి అందులో ఉన్న చీటీలు.. ఒక్కొక్కరు ఒక చీటీ తీసుకోండి అంటూ నాగార్జున చెప్పాడు.’ నేను మీ పేరు చెప్పినప్పుడు .. ఆ చీటీలో ఏముందో చదవండి అని చెప్పారు.

    అమర్ దీప్ నీ చీటీలో ఏముందో చదువు అని నాగార్జున చెప్పగానే .. రతిక అన్ సేఫ్ సార్ అని చెప్పాడు అమర్. తర్వాత ప్రియాంక చీటీలో అశ్విని అన్ సేఫ్ అని ఉంది. అమర్ దీప్ అన్ సేఫ్ అంటూ యావర్ చెప్పాడు. శోభా అన్ సేఫ్ అని అశ్విని చీటీ చదివి చెప్పింది. గౌతమ్ అన్ సేఫ్ అంటూ శోభా చెప్పింది.

    కాగా తర్వాత జరిగిన ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఒక్కొక్కరూ సేవ్ అవుతూ వచ్చారు. చివరిగా గౌతమ్ ఇంకా అశ్విని డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళ ముందు రెండు బాక్స్ లు ఉంచారు. అందులో చేతులు పెట్టాలని చెప్పి .. ఎవరి చేతికైతే రెడ్ కలర్ అంటి ఉంటుందో వారు ఎలిమినేట్ .. గ్రీన్ వస్తే సేఫ్ అంటూ నాగార్జున చెప్పాడు. గౌతమ్ .. అశ్విని ఇద్దరు బాక్స్ లో చేతులు పెట్టారు. ఇద్దరి చేతులకు గ్రీన్ కలర్ ఉంది. దీంతో ఇద్దరూ సేవ్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ లేదని నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు.

    యావర్ తన ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేశాడు. ఈ కారణంగా ఎలిమినేషన్ రద్దు అయ్యింది. ఎవిక్షన్ పాస్ కి మరలా పోటీ జరుగుతుంది. వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పాడు. ఇక ఆదివారం ఎపిసోడ్లో కోట బొమ్మాళీ పీఎస్ టీమ్ సందడి చేశారు. అలాగే హౌస్లో ఒక మిత్రుడిని, శత్రుని ఎంచుకోవాలని నాగార్జున హౌస్ మేట్స్ కి ఫిట్టింగ్ పెట్టాడు.