Bigg Boss Divi: మోడల్ గా కెరీర్ ప్రారంభించిన తెలుగు అమ్మాయి దివి తెలుగులో అడపదడపా రోల్స్ చేశారు. తెరపై వచ్చిపోయే పాత్రలు ఆమెకు ఎలాంటి గుర్తింపు తేలేదు. అలాగే ఒకటి రెండు చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. అయితే బిగ్ బాస్ షోతో ఆమె పాపులారిటీ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 4లో దివి పాల్గొన్నారు. అప్పటి వరకు దివి అనే ఓ హీరోయిన్ ఉందని ఎవరికీ తెలియదు.

ఇక హౌస్ లో దివి తన అందచందాలతో మెప్పించింది. గేమ్ పరంగా కూడా పర్వాలేదు అనిపించింది. అయితే మిగతా లేడీ కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే దివి స్కిన్ షో చేయడంలో వెనుకబడింది. అలాగే కాంట్రవర్సీకి దూరంగా తన పని తాను చేసుకుంటూ పోయేది. మసాలా కంటెంట్ లేకపోవడంతో నిర్వాహకులు కూడా లైట్ తీసుకున్నారు.

హౌస్ లో కొందరు కంటెస్టెంట్స్ తో మాత్రమే కలిసుండడం ఆమె పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గేలా చేసింది. మొదట్లో దివి ఫైనల్ కి చేరుతుందని అందరూ భావించారు. అయితే ఆమె జర్నీ 7 వారాలకే ముగిసింది. అమ్మ రాజశేఖర్ తో ఎక్కువగా స్నేహం చేసిన దివి బిగ్ బాస్ టైటిల్ ఆశలు 49 రోజులకే ముగిశాయి.

ఆ సీజన్ టైటిల్ అభిజీత్ గెలుచుకోగా.. అఖిల్, సోహైల్, అరియానా, హారిక ఫైనల్ కి వెళ్లారు. ఇక దివి హౌస్ లో ఉంది కొద్దిరోజులే అయినప్పటికీ ఆమెకు కొంత ఫేమ్, గుర్తింపు వచ్చింది. దివి మేకర్స్ కంట్లో పడ్డారు. గతంతో పోల్చుకుంటే ఆమె కెరీర్ మెరుగైంది. సినిమాలు, సిరీస్లలో ఆఫర్స్ పట్టేస్తున్నారు.

దివి ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్యాబ్ స్టోరీస్ మూవీ విడుదలైంది. ఆ మూవీ ఫలితం సంగతి ఎలా ఉన్నా ఆమెకు కొంత గుర్తింపు తెచ్చింది. తాజాగా ఆమె ఎటిఎం పేరుతో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. జీ5లో ప్రసారం కానున్న ఈ సిరీస్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కడం విశేషం. ఇటీవల ఈ సిరీస్ పూజా కార్యక్రమాలు నిర్వహించగా దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వీటితో పాటు కొన్ని స్పెషల్ సాంగ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ లో దివి నటిస్తున్నారు. సరైన హిట్ పడితే దివి టాలీవుడ్ లో ఓ స్థాయి హీరోయిన్ కావడం ఖాయం. తెలుగు హీరోయిన్స్ పట్ల కొనసాగుతున్న వివక్ష కూడా దివి లాంటి వాళ్లకు అవకాశాలు రాకపోవడానికి కారణం.
