Bigg Boss Contestant: బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి మరోసారి తండ్రి కాబోతున్నాడు. భార్య కవిత సీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించాడు. కవిత సీమంతం ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఆదిరెడ్డి బిగ్ బాస్(BIGG BOSS TELUGU) ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు. బెంగుళూరులో చిన్న జాబ్ చేసుకునే ఆదిరెడ్డి(ADI REDDY) యూట్యూబర్ గా మారి, బిగ్ బాస్ షోలో పాల్గొనే రేంజ్ కి ఎదిగాడు. స్నేహితుల వద్ద బిగ్ బాస్ షో గురించి ఆదిరెడ్డి మాట్లాడే విధానం, విశ్లేషణ గమనించిన వారు, రివ్యూలు ఇవ్వమని సలహా ఇచ్చారట. ఆ విధంగా ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూవర్ అయ్యాడు. ఆదిరెడ్డి రివ్యూలకు విపరీతమైన రెస్పాన్స్ దక్కింది. బిగ్ బాస్ సీజన్ 6లో ఆదిరెడ్డికి కంటెస్ట్ చేసే ఛాన్స్ వచ్చింది.
Also Read: ‘హరి హర వీరమల్లు’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..పవన్ రేంజ్ కి చిల్లరే ఇది!
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆదిరెడ్డి షోలో రాణించాడు. ఆదిరెడ్డి కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసే విధానం, ఆలోచనల్లో స్పష్టత ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే సెలెబ్స్ కి ఉన్న పాపులారిటీ ఆదిరెడ్డికి లేదు. పైగా ఆదిరెడ్డి స్వతహాగా బిగ్ బాస్ రివ్యూవర్. పలు సీజన్స్ నుండి కంటెస్టెంట్స్ ఆట తీరును గమనిస్తున్నాడు. కాబట్టి… అతడిది జెన్యూన్ గేమ్ అని మెజారిటీ ఆడియన్స్ భావించలేదు.
ఫైనల్ కి వెళ్లిన ఆదిరెడ్డి టైటిల్ మాత్రం అందుకోలేకపోయాడు. సింగర్ రేవంత్ సీజన్ 6 విన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ షోతో ఆదిరెడ్డికి మరింత పాపులారిటీ దక్కింది. ఆయన కుటుంబ సభ్యులు కూడా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే. ఆదిరెడ్డి భార్య కవిత ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టింది. ఆదిరెడ్డితో పాటు కొన్ని టెలివిజన్ షోలు చేసింది కవిత. ఆదిరెడ్డి దంపతులకు ఒక అమ్మాయి సంతానం.
Also Read: వార్ 2 ట్రైలర్ రివ్యూ: ఇద్దరు రూత్ లెస్ ఏజెంట్స్ తలపడితే? బ్లాస్టింగ్ విజువల్స్!
కాగా ఆదిరెడ్డి మరోసారి తండ్రి కాబోతున్నాడు. కవిత సీమంతం ఘనంగా నిర్వహించాడు. ఆదిరెడ్డి-కవిత ఈ సందర్భంగా ఓ ఫోటో షూట్ కూడా చేయడం విశేషం. ఆదిరెడ్డికి అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. యూట్యూబర్ కాకముందు ఆదిరెడ్డి కుటుంబం ఆర్ధిక కష్టాలు చవిచూసిందట. ఏదైనా వేడుకకు వెళ్లాలంటే తల్లి ఒంటి మీద కొంచెం బంగారం కూడా ఉండేది కాదట. ఆర్థిక ఇబ్బందులు తాళలేక తల్లి ఆత్మహత్య చేసుకుందని ఆదిరెడ్డి బిగ్ బాస్ షోలో చెప్పాడు. ఇప్పుడు ఆదిరెడ్డి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు.
View this post on Instagram