Pushpa 3 : పుష్ప 3 సంగతి ఏంటి..? అసలు ఉందా..? ఉంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది…

Pushpa 3 : ఇక అల్లు అర్జున్ కు మాత్రం అటు అట్లీ సినిమా క్యాన్సిల్ అయింది, ఇటు పుష్ప 3 సినిమా కూడా లేనట్టే అనే క్లారిటీ వచ్చింది. ఇక ఒకేసారి అల్లు అర్జున్ కి వరుసగా రెండు దెబ్బలు తగిలాయనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : June 18, 2024 8:53 pm

Pushpa 3 movie

Follow us on

Pushpa 3 : ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 సినిమా వస్తుంది. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్నాం అంటూ సినిమా మేకర్స్ అఫీషియల్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా పోస్ట్ ఫోన్ లా మీద పోస్ట్ పొన్ లు అవుతూ ఉండడం చూస్తున్న అభిమానులు ఈ సినిమా పట్ల కొంతవరకు నిరుత్సాహ పడుతున్నారు.

ఇక ఏది ఏమైనప్పటికి ఆ డేట్ కి ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురావాలని మేకర్స్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా సెట్స్ మీద వుండగానే పుష్ప 3 సినిమా కూడా ఉంటుంది అంటూ అనౌన్స్ చేసిన మేకర్స్ ప్రస్తుతం పుష్ప 3 సినిమా గురించి అసలు పట్టించుకోవడం లేదు. ఇక పబ్లిసిటీ స్టంట్ గా మాత్రమే దానిని వాడినట్టుగా మరికొందరు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. నిజానికి పుష్ప 2 సినిమానే చాలా కష్టం మీద తెరకెక్కిస్తున్నారు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. సుకుమార్ కూడా పుష్ప 3 సినిమాని చేసే ఆలోచనలో లేరట..

ఎందుకు అంటే ఇప్పటికే పుష్ప సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే ఈ సినిమాకి మంచి గుర్తింపు అయితే వచ్చింది. మరి దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమాకి ఫ్రాంచైజీ కొనసాగించే ఆలోచన అతనికైతే లేదట. ఇక మరో కొత్త కథతో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ కు మాత్రం అటు అట్లీ సినిమా క్యాన్సిల్ అయింది, ఇటు పుష్ప 3 సినిమా కూడా లేనట్టే అనే క్లారిటీ వచ్చింది. ఇక ఒకేసారి అల్లు అర్జున్ కి వరుసగా రెండు దెబ్బలు తగిలాయనే చెప్పాలి…