https://oktelugu.com/

Priyanka Jain: ప్రియాంకకు అనారోగ్యం .. సర్జరీ తప్పదన్న వైద్యులు .. ఆందోళన లో శివ్ కుమార్

బుల్లితెర సెలెబ్రెటీలు, యూట్యూబర్స్ చిన్న విషయాలను కూడా వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు. గతంలో హోమ్ టూర్ అని బెడ్ రూమ్ టూర్, శారీస్ కలెక్షన్ అంటూ కనిపించిన ప్రతి దాన్ని వీడియో తీయడం యూట్యూబ్ లో పెట్టడం.

Written By:
  • NARESH
  • , Updated On : January 9, 2024 / 09:41 AM IST

    Priyanka Jain

    Follow us on

    Priyanka Jain: బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ గత 20 ఏళ్లుగా ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుందట. హాస్పిటల్ కి వెళ్లగా డాక్టర్లు ఆమెకు సర్జరీ చేయించుకోవాలని సూచించారట. ప్రియుడు శివ్ కుమార్ ఇదంతా వీడియో తీసి తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. కాగా ప్రియాంకకు చాలా కాలంగా కళ్ళు సరిగ్గా కనిపించవట. అందుకే ఆమె ఎక్కువగా స్పెక్ట్స్ పెట్టుకుని కనిపిస్తుంది. కేవలం షూటింగ్ సమయాల్లో మాత్రమే ఆమె లెన్స్ ఉపయోగిస్తుందట.

    కానీ లెన్స్ వాడటం వల్ల చాలా సమస్యలు రావడం తో కళ్లజోడుకే పరిమితమైందట ప్రియాంక. ఇక ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రియుడితో కలిసి హాస్పిటల్ కి వెళ్లగా శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ప్రియాంక హాస్పిటల్ కి వెళ్ళిన దగ్గర నుంచి సర్జరీ చేయించుకుని బయటకు వచ్చిందాకా మొత్తం వీడియో తీసాడు శివ్ కుమార్. ఇక ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానల్ నెవర్ ఎండింగ్ టేల్స్ లో పోస్ట్ చేశారు.

    కాగా బుల్లితెర సెలెబ్రెటీలు, యూట్యూబర్స్ చిన్న విషయాలను కూడా వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు. గతంలో హోమ్ టూర్ అని బెడ్ రూమ్ టూర్, శారీస్ కలెక్షన్ అంటూ కనిపించిన ప్రతి దాన్ని వీడియో తీయడం యూట్యూబ్ లో పెట్టడం. ఇదంతా ఒక ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ప్రియాంక జైన్ ప్రియుడు శివ్ ఏకంగా హాస్పిటల్ లో జరిగిన సర్జరీ వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు.

    ఇక గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ప్రియాంక – శివ్ కుమార్ బిగ్ బాస్ షో ద్వారా తమ బంధం గురించి బయట పెట్టారు. ఫ్యామిలీ వీక్ లో శివ్ రావడం ప్రియాంక ఇక్కడే పెళ్లి చేసుకుందాం అని చెప్పడం అప్పట్లో బాగా హాట్ టాపిక్ అయింది. అయితే తాజాగా వాళ్ళు 2024 లో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ప్రకటించారు. త్వరలోనే పెళ్లి డేట్ కూడా చెప్తాము అంటూ ప్రియాంక ఓ వీడియోలో చెప్పుకొచ్చింది.