Bigg Boss Ashwini Sri : నల్లగా ఉన్న నో ప్రాబ్లమ్ ఆ ఒక్కటి ఉంటే పెళ్లి చేసుకుంటా… బిగ్ బాస్ అశ్విని శ్రీ ఓపెన్ కామెంట్స్

బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ చెప్పుకొచ్చింది. దీంతో అశ్విని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అశ్విని శ్రీ సరిలేరు నీకెవ్వరు చిత్రంతో పాటు పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.

Written By: NARESH, Updated On : January 10, 2024 7:41 pm
Follow us on

Bigg Boss Ashwini Sri : బిగ్ బాస్ సీజన్ 7 వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది అశ్విని శ్రీ. షో మొదలైన ఐదు వారాల తర్వాత హౌస్ లో అడుగుపెట్టింది. గతంలో చాలా సినిమాల్లో నటించినప్పటికీ రాని గుర్తింపు ఒక్క బిగ్ బాస్ షో ద్వారా వచ్చింది. అశ్విని శ్రీ గేమ్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కానీ .. ఆమె అంద చందాలతో ఆడియన్స్ ని మెప్పించింది. ఇక 12వ వారంలో సెల్ఫ్ నామినేట్ చేసుకుని డబల్ ఎలిమినేషన్ లో రతిక, అశ్విని శ్రీ ఇద్దరు బయటకు వచ్చారు.

అయితే బిగ్ బాస్ ద్వారా క్రేజ్ సంపాదించిన అశ్విని వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో అశ్విని తన పెళ్లి గురించి కొన్ని కామెంట్స్ చేసింది. కాబోయేవాడి లో ఇలాంటి లక్షణాలు ఉండాలి అంటూ మనసులో ఉన్న కోరికలు బయటపెట్టింది. అశ్విని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన పెళ్లి గురించి రకరకాల చర్చలు నడిచాయి. అశ్విని కి పెళ్ళై భర్తను వదిలేసిందని వార్తలు వినిపించాయి.

తాజా ఇంటర్వ్యూలో అశ్విని తాను సింగిల్ అని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ .. నేను ప్రస్తుతం సింగల్. మనసుకు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. నా చుట్టూ చాలా మంది ఉన్నా కూడా ప్రేమ భావన కలిగించలేకపోయారు. నాకు కాబోయేవాడికి ఆస్తిపాస్తులు లేకపోయినా పర్లేదు నేను చూసుకుంటాను. నల్లగా,దరిద్రంగా, అందవిహీనంగా ఉన్నా పర్లేదు. ఒక్క క్వాలిటీ ఉంటే చాలు పెళ్లి చేసుకుంటాను అని అన్నారు అశ్విని.

అతనికి మంచి మనసు ఉండాలి. నన్ను అర్థం చేసుకునే వాడై ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నవాడు ఎదురైతే వెంటనే పెళ్లి చేసుకుంటాను .. అంటూ బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ చెప్పుకొచ్చింది. దీంతో అశ్విని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అశ్విని శ్రీ సరిలేరు నీకెవ్వరు చిత్రంతో పాటు పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.