Amardeep: బిగ్ బాస్ ఫినాలే తర్వాత మీడియా ముందుకు అమర్ రాలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద అమర్ కారుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆయన మరోసారి స్పందించారు. ఆ రోజు జరిగిన పరిణామాలకు అమర్ చాలా బాధ పడ్డాడట. ఆ సమయంలో తనకు వచ్చిన కోపానికి ఎవరినో ఒకరిని చంపేసేవాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఓ ఇంటర్వ్యూకి భార్యతో కలిసి అమర్ దీప్ హాజరయ్యాడు. హౌస్ లో తన బెస్ట్ ఫ్రెండ్ గా మెలిగిన శోభ శెట్టి హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ శోభా అనే ప్రోగ్రాం లో అమర్ ముచ్చటించాడు. శోభా తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా దాడి ఘటన గురించి శోభా అడిగింది. దీంతో అమర్ .. తన తల్లికి ఏమైనా జరిగి ఉంటే ఎవడో ఒకడిని చంపేసేవాడిని అంటూ అమర్ అన్నాడు. కారులో కుటుంబ సభ్యులు ఉండగా రాళ్లు విసిరితే మీరు ఒప్పుకుంటారా.
నాకు అక్కడ ఒక సినిమా సీక్వెన్స్ కనిపించింది. నేను కారు దిగిపోతాను. వాళ్లకు కావాల్సింది నేనే కదా అని అన్నాను వాళ్ళందరూ నన్ను కొట్టినా ఒకడిననైనా నేను కొడతా కదా అనిపించింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కారు డ్యామేజ్ గురించి శోభా అడిగింది. కారు రిపేర్ కు ఎంత ఖర్చు అయిందని శోభా శెట్టి అడగ్గా .. అందుకు రూ. 3.5 లక్షల వరకూ అయింది అని అమర్ తెలిపాడు.
అయితే బిగ్ బాస్ షోలో అమర్ దీప్ మొదట్లో కాస్త తడబడ్డాడు. కానీ చివరి వారాల్లో పుంజుకుని సత్తా చాటాడు. అసలు ఫినాలే వెళ్లడం కూడా కష్టం అనుకుంటే .. శివాజీ ని వెనక్కి నెట్టి ఫైనల్స్ లో రన్నర్ గా నిలిచాడు. దీంతో పాటు రవితేజ సినిమాలో అవకాశం కొట్టేశాడు. బిగ్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లో బాగా పాపులారిటీ దక్కించుకున్న వారిలో అమర్ ఒకడు. శివాజీ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ మరింత ఫేమ్ రాబట్టారు. త్వరలో అమర్ దీప్ వెండితెరపై మెరవనున్నారు. సురేఖావాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా నటిస్తున్న చిత్రంలో అమర్ హీరోగా చేస్తున్నాడు. అమర్ దీప్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు.