https://oktelugu.com/

Amardeep: వాళ్ళు నా భార్యను తీసుకెళతాం అన్నారు, అందుకే కేసు పెట్టలేదు… దాడిపై అమర్ దీప్ షాకింగ్ కామెంట్స్

రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టారు .. అమ్మ పక్కన ఉండగానే నోటికి ఏదొస్తే అది అనేశారు. తల్లి పక్కన ఉన్నప్పుడు అలాంటి మాటలు ఏ కొడుకు వినలేడు. వారందరి కోపం నా మీద కదా అని కారు దిగే ప్రయత్నం చేస్తే అమ్మ ఆపింది.

Written By:
  • NARESH
  • , Updated On : January 12, 2024 / 06:10 PM IST

    Amardeep

    Follow us on

    Amardeep: బిగ్ బాస్ సీజన్ 7 విజయవంతంగా ముగిసింది. కానీ అనూహ్యంగా ఎన్నో వివాదాలు రాజుకున్నాయి. గ్రాండ్ ఫినాలే రోజు అమర్ దీప్ పై జరిగిన దాడి గురించి తెలిసిందే. కొంతమంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పేరుతో అమర్ కారు అద్దాలు పగలగొట్టి .. బూతులు తిడుతూ నానా రచ్చ చేశారు. తన అభిమాన హీరో నుంచి సినిమా ఆఫర్ వచ్చిందని సంతోషంతో ఇంటికి వెళ్తున్న అమర్ కి పెద్ద షాక్ తగిలినట్లయింది. ఆ తర్వాత అమర్ పెద్దగా మీడియా ముందుకు రాలేదు.

    అయితే తన కారు పై దాడి జరిగినప్పుడు తాను ఎంత బాధ పడ్డాడో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎటాక్ గురించి అమర్ మాట్లాడుతూ .. హౌస్ నుంచి బయటకు రాగానే మా వాళ్ళు అందరూ నన్ను దాక్కో అన్నారు. బయట ఏం జరుగుతుందో అర్థం లేదు. నేను ఎందుకు దాక్కోవాలి .. నేనేం తప్పు చేశాను అని కారు ఎక్కి స్టార్ట్ అయ్యాం. కారు బయటకు రాగానే చాలా మంది నా కారు చుట్టూ తిరుగుతూ ఫోన్ లైట్స్ ఆన్ చేశారు. నేను కనిపించగానే ఒక్కసారిగా బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు.

    రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టారు .. అమ్మ పక్కన ఉండగానే నోటికి ఏదొస్తే అది అనేశారు. తల్లి పక్కన ఉన్నప్పుడు అలాంటి మాటలు ఏ కొడుకు వినలేడు. వారందరి కోపం నా మీద కదా అని కారు దిగే ప్రయత్నం చేస్తే అమ్మ ఆపింది. నాలుగు దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ ఆ తిట్లు భరించలేకపోయాను. కొందరైతే నా భార్య తేజును తీసుకెళతాం అంటూ బూతులు మాట్లాడారు. ఇవే మాటలు మిమ్మల్ని ఎవరైనా అంటే తట్టుకోగలరా .. ఓర్చుకోగలరా.

    వారందరి మీద నేను రియాక్ట్ కాగలను .. కేసులు పెట్టగలను, కానీ వారికి కుటుంబాలు ఉంటాయని ఆలోచించి వద్దనుకున్నాను. నేను మీకు ఏం పాపం చేశాను. అది ఒక గేమ్ మాత్రమే .. హౌస్ లో కొందరు నన్ను పదే పదే తిట్టినా పెద్దవారు కదా అని ఓర్చుకున్నాను .. వారి వద్ద నేను నిజాయితీగానే మాట్లాడాను .. బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు. అందరిలాగే నేను కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చాను అంటూ అమర్ దీప్ చెప్పుకొచ్చాడు.