Bigg Boss Second House : టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది ‘ బిగ్ బాస్’ షో అనే చెప్పాలి…ఇప్పటికే 8 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ ని కూడా సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈరోజు నుంచే బిగ్ బాస్ 9 సీజన్ స్టార్ట్ అవుతోంది. కాబట్టి ఈ సీజన్ కోసం సర్వం సిద్ధం చేసి పెట్టినట్టుగా తెలుస్తోంది… ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా చాలా వరకు మార్పులు చేర్పులు అయితే చేశారు. ఇంతకుముందు ఉన్నట్టుగా కాకుండా సరికొత్తగా ప్లాన్ అయితే చేశారు. ఇంకా ఇంతకు ముందు ఒక హౌస్ మాత్రమే ఉండేది ఇప్పుడు రెండో హౌస్ ను సైతం రంగంలోకి దించారు.
కారణం ఏంటి అంటే భారీ టాస్క్ లను నిర్వహించి అందులో ఎవరైతే బాగా ఆడుతారో వాళ్లందర్నీ కొత్త హౌస్ లోకి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పాత హౌస్ తో పోలిస్తే కొత్త హౌస్ లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయట. ఒక లగ్జరీ లైఫ్ ని అనుభవించేటట్టుగా అందులో ఫెసిలిటీస్ అయితే చేసినట్టుగా తెలుస్తోంది.
కాబట్టి బాగా ఎవరైతే ఆడతారో వాళ్లకు మాత్రమే ఆ సెకండ్ హౌస్ లో ఎంట్రీ దొరుకుతొంది…ఇక సెకండ్ హౌస్ లోకి వెళ్లినవాళ్లు పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా వాళ్ళకి ఇన్ స్టంట్ గా అన్ని వాళ్ళదగ్గరికి వస్తాయట…అలాగే కొన్ని లగ్జరీలను కూడా వాళ్ళు అనుభవించొచ్చని చెబుతున్నారు… ఫస్ట్ హౌస్ లో నార్మల్ కండిషన్స్ తో ఉన్న రూములు ఉంటాయి. అదే రెండో హౌస్ లో మాత్రం హై ఫై రూమ్స్ ఉంటాయని తెలుస్తోంది.
మరి ఎవరైతే బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ను పూర్తిచేసి ప్రేక్షకులను అలరించి ఎక్కువ ఓటింగ్స్ ను సంపాదించుకుంటారో వాళ్లకు మాత్రమే సెకండ్ హౌస్ లో చాలా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది… మరి సెకండ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేవారు ఎవరు? సెలబ్రిటీలు దుమ్మురేపుతారా? లేదంటే కామనర్స్ గా వచ్చిన వాళ్ళు సెలబ్రిటి లను డామినేట్ చేసి సెకండ్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది…