Bigg Boss 9 Telugu Nagarjuna Remuneration : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జునకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఆయన సినిమాలు చేస్తూనే బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 8 సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు 9 వ సీజన్ ను సైతం విజయవంతం చేయాలనే ఉద్దేశ్యంతో సరికొత్తగా ముస్తాభై మన ముందుకు వస్తోంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఈ షో మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే పెరిగిపోతున్నాయి. ఇక ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా బిగ్ బాస్ 9 సీజన్ లో చాలా వరకు మార్పులు చేర్పులు చేసి మరి ఈ షోను డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక నాగార్జున ఈ షోలో హోస్ట్ గా అదరగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రోమో ను కనక మన అబ్జర్వ్ చేసినట్లయితే నాగార్జున ఇందులో చాలా హైపర్ ఆక్టివ్ తో కనిపిస్తున్నాడు. ఇంతకుముందు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో ఆయన చాలా ఎగ్జైట్ మెంట్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సీజన్ సక్సెస్ ఫుల్ గా నిలుపడానికి తన వంతు కృషి చేస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే నాగార్జున ఈ సీజన్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనే విషయం మీద ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది… ఇక దీని మీద సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలైతే జరుగుతున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా ఈ సీజన్ కి నాగార్జున దాదాపు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక తను ఈ షో కోసం దాదాపు 20 రోజులపాటు తమ డేట్స్ ను కేటాయించినట్టుగా తెలుస్తోంది.మరి అందులో భాగంగానే 3 కోట్ల రెమ్యూనరేషన్ ను ఛార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా నాగార్జునకి ఇప్పుడు చాలా మంచి గుర్తింపైతే ఉంది.
రీసెంట్ గా వచ్చిన కూలీ సినిమాతో తమిళ్ సినిమా ఇండస్ట్రీలోకి సైతం అడుగుపెట్టిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…ఇక నాగార్జున ను వదులుకోవడం ఇష్టం లేని బిగ్ బాస్ యాజమాన్యం మూడు కోట్ల రెమ్యూనరేషన్ ను ఇచ్చి మళ్ళీ తన చేతనే హోస్ట్ గా చేయిస్తున్నారు…