Bigg Boss 9 Telugu Tanuja: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షోలో వస్తున్న ట్విస్టులు ఏ సీజన్ లో కూడా రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడూ జరగని సంఘటనలు ఈ సీజన్ లో జరుగుతున్నాయి. కొన్ని న్యాయంగా అనిపిస్తున్నాయి, మరికొన్ని అన్యాయంగా అనిపిస్తున్నాయి. ఈ వారం హౌస్ లోకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ భరణి, శ్రీజ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భరణి అత్యధిక టాస్కులు గెలవడమే కాకుండా, ఆడియన్స్ ఓటింగ్ లో కూడా ఆయనే లీడింగ్ లో ఉండడం తో భరణి శాశ్వత హౌస్ మేట్ గా నిల్చిపోయాడు, శ్రీజ ఎలిమినేట్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే భరణి ని అమితంగా ఇష్టపడేవాళ్లు హౌస్ లో ఎవరైనా ఉన్నారా అంటే, అది తనూజ, దివ్య. వీళ్లిద్దరు భరణి హౌస్ లో తన స్థానాన్ని శాశ్వతం చేసుకున్నందుకు మామూలు ఆనందంతో లేరు.
ఆయన శాశ్వత హౌస్ మేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఇమ్మానుయేల్, దివ్య. ఆయన తరుపున వీళ్లిద్దరు రెండు టాస్కులు ఆడి గెలిపించారు. అందుకే దివ్య ని కెప్టెన్ చేసే అవకాశం తన చేతుల్లో ఉన్నప్పుడు దివ్య ని ఈ వారం హౌస్ కి కెప్టెన్ ని చేసినట్టు సమాచారం. ఇంతకీ టాస్క్ ఏమిటో ఒకసారి చూద్దాం. భరణి మరో సారి హౌస్ మేట్ అవ్వడం తో, బిగ్ బాస్ ఆయన్ని డైరెక్ట్ గా కెప్టెన్సీ కంటెండర్ ని చేయడమే కాకుండా, నీతో పాటు పోటీ పడే కంటెండర్స్ ని కూడా నువ్వే ఎంచుకోవాలి అనే ఛాయస్ ఇస్తాడు. అప్పుడు భరణి తనూజ,దివ్య, సాయి శ్రీనివాస్, నిఖిల్ లను తనతో పాటు కెప్టెన్సీ టాస్కు కి పోటీ పడే అవకాశం ఇప్పిస్తాడు. ఎందుకంటే వీళ్లంతా ఇప్పటి వరకు కెప్టెన్లు అవ్వలేదు, దానికి తోడు భరణి కి హౌస్ లో బాగా కావాల్సిన వాళ్ళు. ఇమ్మానుయేల్ కూడా కంటెండర్ అవ్వొచ్చు, కానీ ఆయన ప్రస్తుతానికి కెప్టెన్ గా చేసాడు కాబట్టి ఈ టాస్క్ నుండి తప్పుకున్నాడు.
ఇక ఈ టాస్క్ లో చివరగా తనూజ, దివ్య ఉంటారట. భరణి కి ఎవరో ఒకరిని కెప్టెన్ ని చేసే బాధ్యత ఇస్తాడట బిగ్ బాస్. అప్పుడు ఆయన దివ్య ని కెప్టెన్ చేస్తాడట. ఇక ఆ తర్వాత తెలిసిందే,తనూజ ఏడుపులు, నాన్న మీద అలకలు, నాన్న ఆమెని బ్రతిమిలాడడం, ఇవన్నీ నేటి ఎపిసోడ్ లో మనం చూడొచ్చు. న్యాయం గా చూస్తే భరణి దివ్య ని కెప్టెన్ చేయాలి. ఎందుకంటే హౌస్ లోకి వచ్చినప్పటి నుండి దివ్య భరణి కోసం ఎన్నో చేసింది. కానీ భరణి మాత్రం దివ్య కోసం ఏమి చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన తనూజ కోసం చాలా చేసాడు. అలా చేసి బాగా నెగిటివ్ అయ్యాడు కూడా. కాబట్టి ఈసారికి ఆయన దివ్య ని సపోర్ట్ చేయడమే న్యాయం. కానీ దీన్ని తనూజా ఎలా తీసుకుంటుందో చూడాలి.