Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో లో ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఈరోజు ఒక కంటెస్టెంట్ మీద కలిగిన అభిప్రాయం, పక్క రోజు ఉండడం లేదు. ఆ ప్రభావాన్ని మనం సోషల్ మీడియా లో జరిగిన ఓటింగ్ లో ప్రతీ రోజు గమనించవచ్చు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్, భరణి, డిమోన్ పవన్, సంజన మరియు దివ్య నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వీరిలో టాప్ 1 స్థానం లో పవన్ కళ్యాణ్, టాప్ 2 స్థానం లో ఇమ్మానుయేల్ కొనసాగుతున్నారని, చివరి రెండు స్థానాల్లో సంజన, దివ్య ఉన్నారని, వీళ్ళిద్దరిలో దివ్య కి అతి తక్కువ ఓటింగ్ ఉండడం వల్ల ఆమె ఈ షో నుండి ఎలిమినేట్ అవ్వబోతుంది అనేది సోషల్ మీడియా లో జరుగుతున్న ఓటింగ్ ని బట్టి చెప్పేయొచ్చు.
అంతే కాదు, అధికారిక పోలింగ్ లో కూడా ఇదే తరహా లో ఓటింగ్ జరుగుతోందట. మూడు మరియు నాల్గవ స్థానాల్లో భరణి మరియు డిమోన్ కళ్యాణ్ ఉన్నారు. వీళ్లిద్దరి మధ్య ఉన్న ఓటింగ్ శాతం చాలా తక్కువే. అయితే నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన గొడవ తర్వాత ఓటింగ్ లైన్ మొత్తం చెదిరిపోయింది అని చెప్పొచ్చు. తనూజ ఫ్యాన్స్ దివ్య ని ఎలా అయిన ఇంటికి పంపేయాలి అని ఫిక్స్ అయిపోయారు. దీంతో 5 వ స్థానం లో ఉన్న సంజన కి భారీ లెవెల్ లో ఓట్లు గుద్దేశారు. దీంతో సంజన నాల్గవ స్థానం లోకి వచ్చి, డిమోన్ పవన్/ లేదా భరణి 5వ స్థానం లోకి వచ్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతానికి భరణి సేఫ్ స్థానం లోనే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు గడిచిన 5 రోజుల్లో భారీ ఓటింగ్ జరిగింది, ఫ్యామిలీ ఎపిసోడ్ ఆయనకు అద్భుతంగా కలిసొచ్చింది అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
డిమోన్ పవన్ కి ఈ వారం పెద్దగా ఏది కలిసి రాలేదు, ఫ్యామిలీ ఎపిసోడ్ కూడా అంతంత మాత్రంగానే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. అందుకే ఆయన డేంజర్ జోన్ లోకి వచ్చినట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. కేవలం గంటన్నర లో తనూజ ఫ్యాన్స్ ఆట ని ఇలా తిప్పేశారని, తనూజ ఫ్యాన్ బేస్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని సోషల్ మీడియా లో ఆమె అభిమానులు అంటున్నారు. మరో పక్క దివ్య కి కూడా నిన్నటి ఎపిసోడ్ బాగా కలిసొచ్చింది. తనూజ ని ద్వేషించే వాళ్లంతా నిన్న దివ్య కి ఓటు వేశారు. తనూజ ఫ్యాన్స్ ఏకపక్షంగా సంజన కి నిన్న ఓట్లు వేసి ఉండుంటే మాత్రం, డిమోన్ పవన్ ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా ఉంది పరిస్థితి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి రేపు ఏమి జరగబోతోంది అనేది.