Bigg Boss 9 Telugu Divya Vs Tanuja: ఒక చక్కటి కుటుంబ కథా సీరియల్ లాగా ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో సాగిపోతుంది అని ఆడియన్స్ చిరాకు పడుతున్న సమయం లో నిన్న దివ్య మరియు తనూజ మధ్య జరిగిన గొడవ, తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లోనే ది బెస్ట్ అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు. దివ్య ని డిమోన్ పవన్ మరియు రీతూ చౌదరి కంట్రోల్ చేయకపోయుంటే పాపం తనూజ ని చితకబాదేసి ఉండేది, పరిస్థితి చూస్తే అలాగే అనిపించింది. అంత దారుణంగా వీళ్లిద్దరి మధ్య గొడవలు జరిగాయి. అయితే వీళ్లిద్దరిలో గొడవలో ఎవరిది తప్పు?, ఎవరిది ఒప్పు అనేది ఒక్కసారి విశ్లేషిద్దాం. నిజాయితీగా అలోచించి చూస్తే, తనూజ వైపు నుండి ఆలోచిస్తే ఆమె అలా కోపం తెచ్చుకోవడం లో ఎలాంటి తప్పు లేదని అనిపించింది. అదే సమయం లో దివ్య పెట్టిన పాయింట్స్ కూడా కరెక్ట్ కదా అనిపించింది.
వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ మీలో ఈ వారం ఇంటికి కెప్టెన్ అవ్వడానికి అర్హులు ఎవరు కాదో నిర్ణయించుకొని చెప్పండి అని అడుగుతాడు. ముందుగా దివ్య పైకి లేచి తనూజ పేరు చెప్తుంది. అందుకు కారణాలు ఇప్పటికే రెండు సార్లు ఇమ్మ్యూనిటి వచ్చింది, ఈ వారం కెప్టెన్ గా ఉన్నావు, తదుపరి వారం ప్రతీ ఒక్కరికి ముఖ్యమే కాబట్టి,నీకు ఇమ్మ్యూనిటీ ఇప్పుడు అవసరం లేదు, నీకు ఆడేందుకు అవకాశం ఇచ్చి, ఒకవేళ నువ్వు గెలిస్తే కెప్టెన్ అవ్వాలని అనుకున్న వాళ్లకు నష్టం కదా అందుకే నిన్ను తీసేస్తున్నాను అని చెప్పి తీసింది. దీనికి తనూజ ప్రతీసారి నువ్వు నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటూ మొదలు పెట్టింది. ఈ గొడవలో దివ్య తనూజ పైన ముందుగా నోరు జారింది, దిష్టి బొమ్మ, మనుషులను వాడుకుంటావు, సీరియల్ ఆర్టిస్ట్, ఇలా ఒక్కటా రెండా ఎన్నో మాటలు అనింది.
అందుకు తనూజ కూడా చాలా దీటుగానే సమాధానం చెప్పింది. తనూజ దివ్య తనని టార్గెట్ చేస్తుంది అనుకోవడం లో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ట్రైన్ టాస్క్ లో కావాలని ఉద్దేశపూర్వకంగానే తనూజ ని తప్పించింది. ఎందుకంటే ఆరోజు ట్రైన్ టాస్క్ లో ఆమె క్రిందకు పడిపోవడం వల్ల బాగా దెబ్బలు తగలడం తో నాన్న అని అరవడం, భరణి ఆమె దగ్గరకు వచ్చి పైకి ఎత్తుకొని తీసుకెళ్లడం వంటివి చూసి దివ్య తట్టుకోలేకపోయింది. ఆ ఘటన జరిగిన మరుక్షణమే తనూజ ని టాస్క్ నుండి తప్పించింది. ఇక తనూజ కెప్టెన్ అయ్యినప్పుడు భరణి ఆమెని ఆనందంతో పైకి ఎత్తుకోవడం, అందుకు దివ్య కోపం తెచ్చుకొని భరణి ని తిట్టడం వంటివి చేసింది అనే విషయం కూడా ఆమెకు తెలిసింది. ఇవన్నీ కాకుండా తనూజ కి దెబ్బ తగిలినప్పుడు భరణి ఆయింట్మెంట్ రాయడం అసలు తట్టుకోలేకపోయింది దివ్య. అంతే కాకుండా భరణి కూతురు తనూజ ని మెచ్చుకోవడం, మా నాన్న తో మీ బాండింగ్ ఎంతో బాగుంది అనడం వంటివి దివ్య తీసుకోలేకపోయింది అని తనూజ అనుకోవడం లో ఎలాంటి తప్పు లేదు కదా. ఇవన్నీ గమనించి చూస్తే దివ్య కావాలని కక్ష్య పెట్టుకొని తనూజ ని టార్గెట్ చేసినట్టు అనిపించింది కానీ, ఆమె పెట్టిన పాయింట్స్ మాత్రం చాలా లాజిక్ తోనే ఉన్నాయి.