Bigg Boss 9 Telugu Top 2 Contestants: బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు వచ్చేసింది. నాల్గవ సీజన్ తర్వాత మన తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకున్నట్టు విశ్లేషకులు అంటున్నారు. ప్రతీ వారం టీఆర్ఫీ రేటింగ్స్ 10 కి తగ్గకుండా వస్తున్నాయి. ఇది సాధారణమైన విషయం అయితే కాదు. గడిచిన మూడు సీజన్స్ కంటే ఈ సీజన్ లో గొడవలు తక్కువ, టాస్కులు కూడా తక్కువే. కానీ ఫ్యామిలీ డ్రామా ఎక్కువ ఉండడం తో టీవీ సీరియల్స్ చూసే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీజన్ కి తెగ కనెక్ట్ అయిపోయారు. అందుకే ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఇదంతా పక్కన పెడితే ప్రతీ సీజన్ లోనూ టైటిల్ విన్నర్ ఎవరు అనేది చాలా తేలికగా ఫ్యామిలీ వీక్ కి ముందే అర్థం అయిపోతుంది.
కానీ ఈ సీజన్ లో మాత్రం ఎవరు టైటిల్ కొట్టబోతున్నారు అనే విషయం లో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కేవలం పవన్ కళ్యాణ్, తనూజ మధ్యనే టైటిల్ రేస్ కొనసాగుతుంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ట్రోఫీ లిఫ్ట్ చేస్తారు. కానీ ఎవరు చేస్తారు అనే దానిపై ఫినాలే వీక్ చివరి రోజు వరకు ఉత్కంఠ తప్పదు. ఇక ఇమ్మానుయేల్ విషయానికి వస్తే, మొదటి నాలుగు వారాల్లో ఇతను టాప్ 2 రేంజ్ లో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆయన గ్రాఫ్ భారీ గా పడిపోయింది. టాప్ 3 స్థానం కోసం భరణి తో పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. ఇంతలా ఆయన గ్రాఫ్ పడిపోవడానికి కారణం, సేఫ్ గేమ్. ఎవరితోనూ స్వచ్ఛమైన బాండింగ్ ని ఇమ్మానుయేల్ కొనసాగించలేదు. కేవలం తానూ గెలవడం కోసమే బంధాలు పెట్టుకున్నట్టు అనిపించింది, అందుకే ఆడియన్స్ లో అతని గ్రాఫ్ బాగా పడిపోయింది అని అంటున్నారు.
ఇక తనూజ , కళ్యాణ్ విషయానికి వస్తే, వీళ్లిద్దరు టాప్ 2 లో ఉన్నప్పటికీ మంచి స్నేహాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. గతం లో టాప్ 2 లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య ఏ రేంజ్ లో గొడవలు జరిగేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత సీజన్ లో అయితే నిఖిల్, గౌతమ్ మధ్య కొట్లాట జరిగినంత పని అయ్యింది. సీజన్ 7 లో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య ఏ రేంజ్ గొడవలు ఉండేవో మనమంతా చూసాము. కానీ సీజన్ లో మాత్రం టాప్ 2 కంటెస్టెంట్స్ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్నారు. వీళ్ళిద్దరిది ప్రేమ నా?, లేదా స్నేహమా అనేది పక్కన పెడితే వీళ్ళ బాండింగ్ ని అందరూ ఇష్టపడుతున్నారు. కానీ వీళ్లిద్దరి అభిమానులు మాత్రం సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఓటింగ్ లో తేడా కేవలం 2 శాతం మాత్రమే. మూడు వారాల క్రితం వరకు కూడా తనూజ కి భారీ ఓటింగ్ ఉండేది. కళ్యాణ్ దరిదాపుల్లో కూడా ఉండేవాడు కాదు. తనూజ కి 60 శాతం ఓటింగ్ ఉంటే, పవన్ కళ్యాణ్ కి కేవలం 26 శాతం ఓటింగ్ మాత్రమే ఉండేది. కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత లెక్కలు మొత్తం మారిపోయాయి. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మరియు అతని ఎమోషనల్ కనెక్షన్ ని చూసిన ఆడియన్స్ లో ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ ని విన్నర్ చెయ్యాలని చూస్తున్నారు. మిడిల్ క్లాస్ అబ్బాయి, సైనికుడు, చూసేందుకు మన ఇంట్లో కుర్రాడిలాగా ఉన్నాడు అని ఇతనికి బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతానికి ఆడియన్స్ లో ఒక రెండు అడుగులు పవన్ కళ్యాణ్ ముందంజ లో ఉన్నాడు. ఫ్యామిలీ వీక్ నుండి ఆయనకు నాన్ స్టాప్ గా పాజిటివ్ ఎపిసోడ్స్ పడడమే అందుకు కారణం అనుకోవచ్చు. స్టార్ మా ఛానల్ కూడా ఇతన్ని టైటిల్ విన్నర్ ని చేయడమే లక్ష్యం గా పెట్టుకున్నట్టు అనిపిస్తోంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.