Bigg Boss 9 Telugu Elimination: ఈ సీజన్ బిగ్ బాస్ షో రోజురోజుకి ఆడియన్స్ ని చిరాకు పుట్టించేస్తోంది. సినిమాకు తక్కువ, సీరియల్ కి ఎక్కువ అన్నట్టుగా ఈ షో సాగుతుందే కానీ, రియాలిటీ షో లాగా అసలు నడవడం లేదు. హౌస్ మేట్స్ అందరూ అవసరానికి తగ్గట్టు డ్రామాలు వేస్తున్నారు, ఒక్కరంటే ఒక్కరు కూడా నిజమైన రిలేషన్ తో ముందుకు సాగడం లేదు. ఉన్నవారిలో భరణి, సుమన్ శెట్టి,రీతూ చౌదరి వంటి వారు నిజమైన రిలేషన్ ని మైంటైన్ చేస్తున్నారే కానీ, మిగిలిన కంటెస్టెంట్స్ మాత్రం తమ అవసరాలకు రిలేషన్స్ ని వాడుకుంటున్నారు. అలాంటి వారిలో తనూజ మొదటి స్థానం లో నిలుస్తుంది. దురదృష్టం కొద్దీ ఆమె ఓటింగ్ లో కూడా ప్రస్తుతం మొదటి స్థానం లోనే కొనసాగుతూ ముందుకెళ్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన వారు తనూజ, పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి, భరణి, సంజన , సాయి, రాము రాథోడ్.
వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే దానిపై చాలా సస్పెన్స్ నెలకొంది. ఓటింగ్ ప్రకారం చూస్తే అందరికంటే తక్కువ ఓట్లతో సాయి కొనసాగుతున్నాడు. అతను ఎలిమినేట్ అవ్వడం మాత్రం పక్కా. కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కచ్చితంగా ఉంటుంది అనే టాక్ బలంగా వినిపిస్తోంది. అదే కనుక జరిగితే హౌస్ నుండి వెళ్లిపోయే కంటెస్టెంట్ ఎవరు అని సోషల్ మీడియా లో పెద్ద చర్చ సాగుతోంది. ఒకసారి భరణి ఎలిమినేట్ అయ్యి లోపలకు వచ్చాడు కదా, ఆయనకు ఆడియన్స్ ఓటింగ్ అంతగా ఉండదేమో, ఈయన ఎలిమినేట్ అవ్వొచ్చు అని అనుకుంటే పొరపాటే. భరణి కి ప్రస్తుతం సుమన్ శెట్టి తో సమానంగా ఓటింగ్ పడుతోంది. ఎలిమినేట్ అయితే సంజన, రాము లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి.
Also Read: జానీ మాస్టర్ కి డ్యాన్స్ పై పట్టు పోయిందా..? విపరీతమైన ట్రోల్స్ కి గురి అవుతున్న ‘పెద్ది’ స్టెప్!
తనూజ చేతిలో సేవింగ్ పవర్ ఉంది. ఈ వారం నాగార్జున ఆమె చేత దానిని కచ్చితంగా వాడిస్తాడు. డేంజర్ జోన్ లోకి రాము, సాయి వస్తే, తనూజ రాము కోసం సేవింగ్ పవర్ ఉపయోగించడానికి సిద్దమే, కానీ రాము తన తల్లిదండ్రులను బాగా మిస్ అవుతున్నాడు. కాబట్టి ఆయన ఈ సేవింగ్ పవర్ ని వద్దు అనే అవకాశం లేకపోలేదు. ఒకవేళ రాము కాకుండా సంజన, సాయి డేంజర్ జోన్ లో ఉంటే, తనూజ సంజన కోసం కచ్చితంగా సేవింగ్ పవర్ ని ఉపయోగిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు, చూడాలి మరి ఏమి జరగబోతోంది అనేది. వచ్చే వారం తర్వాత ఫ్యామిలీ వీక్ ఉండడం తో హౌస్ లో కేవలం పది మందిని మాత్రమే ఉంచే ప్లాన్ లో ఉన్నాడు బిగ్ బాస్.