Bigg Boss 9 Telugu Ticket To Finale Race: ఈ వారం బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో జరుగుతున్న టికెట్ టు ఫినాలే టాస్కులు, సీజన్ మొత్తం మీద ది బెస్ట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. మొదటి రోజు ఇమ్మానుయేల్ రెండు టాస్కులలో ఆడి గెలిచి చూపించాడు. గెలవడం అనేది ఇమ్మానుయేల్ కి చాలా తేలికైన విషయం లాగా మారిపోయింది. అదే విధంగా తనూజ కూడా నిన్న భరణి , డిమోన్ పవన్ లతో గేమ్ ఆడి గెలిచింది. ఇక్కడ భరణి సపోర్ట్ కూడా ఆమెకు కాస్త తోడు అయ్యింది అనొచ్చు. కానీ నిన్న రాత్రి జరిగిన రెండవ టాస్క్ లో మాత్రం తనూజ ‘ది లేడీ టైగర్’ అని అనిపించుకుంది. ఒక టాస్క్ గెలవడం తో బిగ్ బాస్ ఆమెకు ఎవరితో తలపడాలో ఎంచుకునే అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఆమె సుమన్ శెట్టి ని ఎంచుకుంది.
Also Read: బాలయ్య హిందీలో నరుకుడే నరకుడు..యాంకర్ కూడా షాక్.. వీడియో వైరల్!
టాస్క్ ఏమిటంటే రోప్ సహాయం తో పైన ఉన్న వాటర్ టబ్ ని బ్యాలన్స్ చేస్తూ ఉండాలి. కంటెస్టెంట్స్ తమకు మొదటి ఫైనలిస్ట్ అయ్యేందుకు ఇష్టం లేని కంటెస్టెంట్ టబ్ లో వాటర్ నింపాలి. ఈ టాస్క్ లో భరణి, డిమోన్ పవన్ తప్ప, హౌస్ మేట్స్ అందరూ తనూజ కి సపోర్ట్ చేస్తారు. అయినప్పటికీ కూడా సుమన్ శెట్టి గెలుస్తాడు. తనూజ కి శరీరం మొత్తం గాయాలు ఉన్నప్పటికీ తనవంతు బెస్ట్ ఇచ్చేందుకు చాలా గట్టి ప్రయత్నమే చేసింది. ఇక ఈరోజు విడుదలైన ప్రోమోలను మీరంతా చూసే ఉంటారు. మొదటి ప్రోమో టాస్క్ లో సుమన్ శెట్టి గెలుస్తాడు, అది తెలిసిందే. రెండవ ప్రోమో టాస్క్ లో డిమోన్ పవన్, పవన్ కళ్యాణ్ మరియు సుమన్ శెట్టి పోటీ పడుతారు. ఈ టాస్క్ లో డిమోన్ పవన్ గెలుస్తాడు. ఇక మరుసటి రౌండ్ లో ఆయనకు ఎవరితో పోటీ పడాలో ఎంచుకునే ఛాయస్ బిగ్ బాస్ ఇవ్వగా, పవన్ భరణి ని ఎంచుకుంటాడు.
మూడవ ప్రోమో ఈ టాస్క్ కి సంబంధించినదే. ఈ టాస్క్ లో భరణి గెలుస్తాడు. దీంతో డిమోన్ పవన్ టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇలా ఈరోజు జరిగిన టాస్కులు మొత్తం కలిపి చూసుకుంటే టికెట్ టు ఫినాలే రేస్ నుండి సంజన, తనూజ, సుమన్ శెట్టి, డిమోన్ పవన్ లు ఎలిమినేట్ అవ్వగా, భరణి,రీతూ చౌదరి, ఇమ్మానుయేల్ మరియు పవన్ కళ్యాణ్ లు ఈ టాస్క్ లో మిగులుతారు. వీరిలో ఎవరు టికెట్ టు ఫినాలే గెలిచి మొదటి ఫైనలిస్ట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టీ చూస్తే ఇమ్మానుయేల్ మరియు భరణి లలో ఎవరో ఒకరు మొదటి ఫైనలిస్ట్ అయ్యే అవకాశాలు ఉఉన్నాయని అంటున్నారు.