Bigg Boss 9 Telugu Thanuja Gowda: కాసేపటి క్రితమే బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) సీజన్ మొదలైంది. ముందుగా భారీ బిల్డప్ తో హౌస్ ని చూపించారు. ఆ తర్వాత అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ని చూపించారు. వాళ్ళతో నాగార్జున(Akkineni Nagarjuna) కాసేపు ముచ్చట్లు ఆడిన తర్వాత మొదటి కంటెస్టెంట్ ని పరిచయం చేశారు. మొదటి కంటెస్టెంట్ గా తనూజా గౌడ అడుగుపెట్టింది. ఈమె ముద్ద మందారం అనే పాపులర్ సీరియల్ లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా కనిపించింది. గత వారం వరకు ప్రసారమైన ‘కూకు విత్ జాతి రత్నాలు’ లో ఒక కంటెస్టెంట్ గా చేసింది. టాప్ 6 గా మిగిలింది. ఈమెని చూస్తుంటే చాలా యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే నాగార్జున ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్స్ ని చూపించి, వీరిలో నీకు బలమైన పోటీ అని ఎవరని అనుకుంటున్నావు అని అడగ్గా, దానికి తనూజ నాకు ఎవ్వరూ పెద్దగా అనిపించలేదు. నా ఆట ని మీరింకా చూడలేదు కదా అని సమాధానం ఇచ్చింది.
ఇదంతా పక్కన పెడితే ఈమె తన తండ్రికి ఇష్టం లేకుండా బిగ్ బాస్ షో లోకి అడుగుపెట్టింది అట. అందుకు ఆయన మాట్లాడడం కూడా మానేసాడు అట. మొదటి నుండి ఈమె సీరియల్స్ లోకి రావడం అతనికి ఇష్టం లేదట. కానీ సక్సెస్ అయ్యింది కాబట్టి ఏమి మాట్లాడలేదు కానీ, బిగ్ బాస్ కి వద్దని పదే పదే చెప్తున్నా కూడా వచ్చిందట. నాగార్జున కూడా ఆమె తండ్రికి భరోసా ఇస్తూ మా ఇండస్ట్రీ కి మీ అమ్మాయి వచ్చింది, మా సొంత బిడ్డ లాగా చూసుకుంటాము, దయచేసి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి అని అన్నాడు. మరి తనూజ తన అద్భుతమైన ఆట తీరుతో గత సీజన్ లో యష్మీ ఎలా అయితే చాలా ఏళ్ళ నుండి తనతో మాట్లాడని తండ్రిని మాట్లాడించేలా చేసిందో, అలా తనూజ కూడా చేస్తుందా లేదా అనేది చూడాలి.