Madharasi Collection: ప్రస్తుతం నడుస్తున్న ఓటీటీ ట్రెండ్ లో ఒక సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే మొదటి రోజు మ్యాట్నీ షోస్ నుండి సర్దేయడమే. అలాంటి దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం ఇండస్ట్రీ లో నడుస్తున్నాయి. ఇలాంటి కష్టమైన సమయం లో ఫ్లాప్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ భారీ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్నవాళ్లే నిజమైన సూపర్ స్టార్ అనుకోవచ్చు. తమిళనాడు నుండి అలాంటి స్టార్ గా భవిష్యత్తులో శివ కార్తికేయన్(Siva Karthikeyan) నిలవబోతున్నాడా అని ట్రేడ్ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మదరాసి'(Madharasi Movie) రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే. AR మురుగదాస్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ ప్రభావం వసూళ్ల మీద పడుతుందేమో అని అంతా అనుకున్నారు, కానీ ఇసుమంత కూడా ప్రభావం చూపలేకపోయింది.
మొదటి రోజు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 24 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, రెండవ రోజు 21 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలా రెండు రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తమిళనాడు ప్రాంతానికి చెందిన ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు డిజాస్టర్ టాక్ వస్తే మొదటి రోజే క్లోజింగ్ వసూళ్లను వేసుకోవచ్చు. అలాంటిది ఈ చిత్రానికి రెండవ రోజు ఈ రేంజ్ హోల్డ్ ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు, బాక్స్ ఆఫీస్ ట్రెండ్ ఎలా ఉంది అనేది. ప్రాంతాల వారీగా ఈ సినిమాకు వచ్చిన వసూళ్లను ఒకసారి చూద్దాం. తమిళనాడు నుండి 24 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా కర్ణాటక లో రెండు రోజుల్లో 2 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కేరళ నుండి కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి పాతిక లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , ఇవెర్సెల్స్ నుండి 14 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 45 కోట్ల 50 లక్షల రూపాయిలు వచ్చాయి. అంటే షేర్ వసూళ్లు 23 కోట్లు అన్నమాట. బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ చిత్రం అందుకోవాలంటే మరో 68 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. మరి ఆ రేంజ్ కి ఈ సినిమా చేరుకుంటుందా లేదా అనేది రేపటి ట్రెండ్ ని బట్టి తెలుస్తుంది.