Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే, ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు తనూజ. ఈమె హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే అద్భుతంగా గేమ్ ఆడిన సందర్భం ఒక్కటి కూడా లేదు. కేవలం నామినేషన్స్ సమయం లో చాలా తెలివిగా డిఫెండ్ చేస్తుంది అంతే. బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజీ ఎలా అయితే పెద్దగా గేమ్స్ ఆడకుండా, మైండ్ గేమ్ తో గేమ్స్ ఆడుకుంటూ వస్తూ, టాప్ 3 వరకు వచ్చాడో, తనూజ కూడా అదే విధమైన గేమ్ ప్లాన్ తో ముందుకు పోతోంది. శివాజీ గేమ్ అప్పట్లో కొంతమందికి చాలా కన్నింగ్ గా అనిపించేది. ఇప్పుడు తనూజ గేమ్ అంతకు మించిన కన్నింగ్ గేమ్ లాగా అనిపిస్తోంది. ఈమె ఆడుతున్నది చాలా డేంజరస్ గేమ్.
హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో రిలేషన్ పెట్టుకోవడం, వాళ్ళతో ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టు నటించడం, సమయం సందర్భం చూసి వాళ్ళని తొక్కేయడం. ఈ వారం భరణి విషయం లో అదే జరిగింది. పాపం ఈమె ఇచ్చిన స్ట్రోక్ కి ఆయన ఇంకా తేరుకోలేదు, హాట్ స్టార్ లో లైవ్ చూసే వాళ్లకు అర్థం అవుతోంది, ఆయన ఎంతలా కృంగిపోయాడు అనేది. నిన్న నామినేషన్స్ లో ఇమ్మానుయేల్ తో ఏ రేంజ్ లో గొడవపడిందో మనమంతా చూసాము. ఇమ్మానుయేల్ సరైన పాయింట్స్ ని పెట్టి, తనూజ ని లాక్ చేయడం తో, ఇక ఏమి చేయాలో తెలియక, నువ్వెంటే నాకు చాలా ఇష్టం అంటూ ఎమోషనల్ గా డైలాగ్స్ కొట్టి, నిన్న రాత్రి అతనితో కలిసిపోయింది. ఇది చూసిన తనూజ ఫ్యాన్స్ కి, బిగ్ బాస్ లవర్స్ కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. అంతే కాదు ఇప్పుడు ఈమె రాము రాథోడ్ తో అకస్మాత్తుగా విపరీతమైన బాండింగ్ ని మైంటైన్ చేస్తోంది.
ఈరోజు ఉదయం నుండి నా చిట్టి తమ్ముడు, బంగారు తమ్ముడు అంటూ ఎప్పుడూ లేనంత ప్రేమని కురిపిస్తోంది. ఈమె దగ్గర సేవింగ్ పవర్ ఉండడం, దాంతో గౌరవ్ ని సేవ్ చేయమని రాము తనూజ ని బ్రతిమిలాడడం, ఎలిమినేషన్ రౌండ్ లోకి వచ్చినప్పుడు మాధురి కోసం ఆ సేవింగ్ పవర్ ని ఉపయోగించకపోవడం, నీకోసమే ఆ పవర్ ని ఉపయోగించలేదు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం, అప్పటి నుండి రాము ని తన బానిస లాగా వాడుకోవడం మొదలు పెట్టింది. ఈరోజు ఉదయం అతనితో బట్టలు కూడా ఉతికించుకుంది. కానీ నిజానికి ఆ సేవింగ్ పవర్ ఆమె రాము కోసం ఉపయోగించలేదు, మాధురి నాకు వాడొద్దు, నాకు ఇంటికి వెళ్లాలని ఉంది అని చెప్పడం వల్లే ఆమె ఉపయోగించలేదు. ఇది గౌరవ్ కి మాత్రమే తెలుసు. ఇలా ప్రతీ ఒక్కరి దగ్గర తనూజ ఇలాంటి గేమ్ ని ఆడుతూ ముందుకు వెళ్తోంది.
నిన్న మొన్నటి వరకు భరణి తో నాన్న బాండింగ్ ని మైంటైన్ చేస్తూ వచ్చిన ఈమె, ఇప్పుడు అతనితో నాకు సంబంధమే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. కనీసం అతని ముఖం వైపు చూసేందుకు కూడా ఆమె ఇష్టం చూపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు భరణి అవసరం ఆమెకు లేదు. చూసే ప్రతీ ప్రేక్షకుడు అతనిది సేఫ్ గేమ్ ని అంటున్నారని ఆమెకు అర్థం అవ్వడం. పైగా ఆడియన్స్ ఓటింగ్ కూడా అనుకున్నంత గొప్పగా అతనికి లేదు అనే విషయం కూడా ఆమెకు అర్థం అవ్వడం తో పాటు, గత వారంలో టాస్క్ జరుగుతున్న సమయంలో భరణి కి గాయం అవ్వడం, ఆ గాయం కారణంగా అతనికి ఫిజికల్ గా కూడా ఇప్పుడు తనకు ఉపయోగపడదు అని ఆమెకు అర్థం అవ్వడం వల్లే, ఇప్పుడు భరణి ని పూర్తిగా పక్కన పెట్టేసింది. తన వైపు ఇప్పుడు ఇమ్మానుయేల్, డిమోన్ పవన్, రీతూ చౌదరి, పవన్ కళ్యాణ్, రాము వంటి బలమైన కంటెస్టెంట్స్ ని పెట్టుకోవడంలో, అదే విధంగా భరణి ని ఏకాకి చేయడం లో ఈమె గొప్పగా సక్సెస్ అయ్యింది. మాధురి లాంటి బలమైన నోరున్న కంటెస్టెంట్ నే తనకు బానిసలుగా మార్చేసుకొని గేమ్ కోసం వాడిందంటే, ఆమె మాస్టర్ మైండ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో ఆమెపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.