Bigg Boss 9 Telugu Tanuja: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) లో వస్తున్నటువంటి ట్విస్ట్స్ ఏ సీజన్ లో కూడా రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు, నిన్న మొన్నటి వరకు స్నేహం గా ఉన్నవాళ్లు ఇప్పుడు శత్రువులు అయిపోయారు. శత్రువులుగా ఉన్నవాళ్లు మిత్రులుగా మారిపోయారు. అసలు ఏంటో, ఈ సీజన్ ఎటు వైపు వెళ్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే ఒక్కటైతే నిజం, ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా తనూజ నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సోషల్ మీడియా లో జరుగుతున్న పొలింగ్స్ లో ఆమెకు పడుతున్న ఓటింగ్ ని చూస్తుంటే ఎవరికైనా మతిపోవాల్సిందే. మొదటి స్థానం లో ఉన్న ఆమెకు, రెండవ స్థానం లో ఉన్న పవన్ కళ్యాణ్ కు దాదాపుగా 30 శాతం తేడా ఉంది. ఈ రేంజ్ డామినేషన్ గతం లో ఏ సీజన్ లో కూడా కనిపించలేదు.
పైగా గత వారం నుండి తనూజ కి అన్నీ పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి. తానూ తండ్రిగా ఎంతో ప్రేమించిన భరణి ఎలిమినేట్ అవ్వడంతో, ఈమె వీకెండ్ ఎపిసోడ్ లో ఎమోషనల్ అయిన తీరుని చూస్తే, ఎలాంటి వారికి అయినా కన్నీళ్లు రాక తప్పదు. వీళ్ళ బాండింగ్ కేవలం డ్రామా అని అనుకున్న ప్రతీ ఒక్కరికీ, వీళ్లది నిజమైన బాండింగ్ అని కనువిప్పు కలిగింది. అప్పటి నుండి భరణి ని అభిమానించే అభిమానుల ఓటింగ్ కూడా తనూజ కి తోడైంది. దానికి తోడు సోమవారం జరిగిన నామినేషన్స్ లో రమ్య, తనూజ ని నామినేట్ చేస్తూ చాలా లూజ్ మాటలు వదలడం తనూజ కి మరింత ప్లస్ అయ్యింది. తనూజ లోని మైనస్ లను హైలైట్ చేసి చెప్పే ప్రయత్నం రమ్య చేసింది,కానీ ఆమె నోటి దూల కారణంగా ఆ ప్రయత్నం బెడిసికొట్టింది.
మరోపక్క ఇమ్మానుయేల్ తనూజ తో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. మొదటి వారం నుండి తనూజ కి క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకరు ఇమ్మానుయేల్. కానీ తనూజ ప్రస్తుతం అందరి కంటే టాప్ లో ఉందనే విషయాన్ని గ్రహించిన ఇమ్మానుయేల్, ఆమెని టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు. మొన్న నామినేషన్స్ లో పవన్ కళ్యాణ్ తో నామినేట్ చేసే ప్రయత్నం చేసాడు. కానీ పవన్ కళ్యాణ్ తనూజ ని కాకుండా సంజన ని నామినేట్ చేయడం తో ఇమ్మానుయేల్ కి కోపం వచ్చి కళ్యాణ్ ని తిడుతాడు. వీళ్లిద్దరు కలిసి నన్ను టార్గెట్ చేసి నామినేట్ చెయ్యాలని అనుకున్నారా?, ఇదెక్కడి అన్యాయం అంటూ తనూజ షాక్ కి గురైంది. ఇలా అందరూ రిపీట్ గా తనూజ ని టార్గెట్ చేయడం తో, ముందు నుండి టాప్ 1 స్థానం లో ఉన్న ఆమెని, టైటిల్ కి మరింత చేరువ అయ్యేలా చేసింది. ఇదే తీరుని కొనసాగిస్తూ వెళ్తే, టెలివిజన్ బిగ్ బాస్ హిస్టరీ లో మొట్టమొదటి టైటిల్ విన్నర్ గా తనూజ నిలిచే అవకాశాలు ఉన్నాయి.