Dude Movie Collection Day 4: ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డ్యూడ్'(Dude Movie) దీపావళి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుని ముందుకు దూసుకుపోతోంది. తమిళనాడు లో ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వస్తున్నాయి కానీ, తెలుగు లో మాత్రం యావరేజ్ రేంజ్ కలెక్షన్స్ మాత్రమే నమోదు అవుతున్నాయి. అందుకు కారణం ఈ చిత్రం కంటే కిరణ్ అబ్బవరం ‘K ర్యాంప్’ కి మంచి పాజిటివ్ టాక్ రావడమే. ఆ సినిమా ప్రభావం ‘డ్యూడ్’ పై చాలా గట్టిగానే పడింది. మొదటి 4 రోజులకు కలిపి 56 శాతానికి పైగా రీకవరీ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఇదే తరహా స్టడీ కలెక్షన్స్ ని మైంటైన్ చేస్తే ఈ వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ మార్కుకు చాలా దగ్గరగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 5 రోజుల్లో ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లు ఎంతో ఒక లుక్ వేద్దాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే ఈ చిత్రానికి 5వ రోజున 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అందులో తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన గ్రాస్ దాదాపుగా రెండు కోట్ల రూపాయిల వరకు ఉంటుందని, తమిళనాడు నుండి 9 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని, మిగతా ప్రాంతాల నుండి దాదాపుగా కోటికి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఓవరాల్ గా 5 వ రోజున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 12 నుండి 13 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది అంటున్నారు. మొత్తం మీద 5 రోజులకు కలిపి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. షేర్ దాదాపుగా 40 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు.
లవ్ టుడే , డ్రాగన్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ చిత్రం విడుదలకు ముందే 60 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుంది. ఇప్పటి వరకు 40 కోట్లు వచ్చాయి, ఇక 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని అందుకుంటుంది. మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందా లేదా అనేది వర్కింగ్ డేస్ లో హోల్డ్ ని బట్టీ ఉంటుందని అంటున్నారు. వర్కింగ్ డేస్ లో భారీ డ్రాప్స్ లేకుండా, డీసెంట్ స్టడీ వసూళ్లను మైంటైన్ చేస్తూ ముందుకుపోతే, కచ్చితంగా ఈ వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి ప్రదీప్ కి హ్యాట్రిక్ హిట్స్ హీరో అనే క్రెడిట్ వరిస్తుందా లేదా అనేది.