Bigg Boss 9 Telugu Bharani: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో లో టైటిల్ విన్నర్ గా ఎవరు?, రన్నర్ గా ఎవరు మిగలబోతున్నారు అనేది దాదాపుగా ఖరారు అయ్యింది. అందరికంటే అత్యధిక ఓటింగ్ తో మొదటి రోజు నుండి తనూజ కొనసాగుతుంటే, నాల్గవ వారం నుండి పవన్ కళ్యాణ్ రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు. వీళ్లిద్దరి మధ్య ఓటింగ్ తేడా చాలానే ఉంది. కానీ వీళ్లకు దరిదాపుల్లో కూడా మరో కంటెస్టెంట్ లేకపోవడం గమనార్హం. ప్రతీ వారం నామినేషన్స్ లోకి వచ్చి ఉండుంటే ఇమ్మానుయేల్ కి కచ్చితంగా టాప్ 2 లేదా టాప్ 1 స్థానం దక్కేది. కానీ ఆయన పది వారాల నుండి నామినేషన్స్ లోకి రావడం లేదు. నిన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ ఇమ్మానుయేల్ ని నామినేషన్స్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ బిగ్ బాస్ ప్రయత్నం విఫలం అయ్యింది.
నిన్నటి నామినేషన్స్ ఎంత చెత్తగా జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సరైన పాయింట్స్ లేకపోవడం తో కంటెస్టెంట్స్ అందరూ పాపం గౌరవ్, నిఖిల్ లపై నామినేషన్స్ వేసి సేఫ్ గేమ్ ఆడారు. దీంతో బిగ్ బాస్ కి కూడా చిరాకు వచ్చింది. ఇమ్మానుయేల్ ని తప్ప హౌస్ మేట్స్ అందరినీ నామినేట్ చేసాడు. కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ లోకి రావడం తో టాప్ 5 స్థానాల్లో ఎవరున్నారో ఒకసారి చూద్దాం. మొదటి రెండు స్థానాల్లో తనూజ, పవన్ కళ్యాణ్ లు కొనసాగుతున్నారు. మూడవ స్థానం లో డిమోన్ పవన్ కొనసాగుతున్నాడు. ఇక నాల్గవ స్థానం లో ఎవ్వరూ ఊహించని విధంగా గత వారం లో డేంజర్ జోన్ లోకి వచ్చిన భరణి కొనసాగుతున్నాడు. కేవలం ఒకటి రెండు పోల్స్ లో మాత్రమే కాదు. దాదాపుగా అన్ని పోల్స్ లోనూ భరణి టాప్ 4 స్థానం లో కొనసాగుతున్నాడు. ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం.
దివ్య, తనూజ లు గొడవలు పడి సంబంధమే లేని భరణి పేరు ని మధ్యలోకి తీసుకొని రావడం, అదే విధంగా భరణి సేవింగ్ చేసే అవకాశం వస్తే, ఎలిమినేషన్ నుండి నన్ను సేవ్ చేస్తావా అని తనూజ ని దీనంగా అడగడం, అందుకు తనూజ అలోచించి చెప్తాను అనడం వంటివి భరణి పై ఆడియన్స్ లో విపరీతమైన సానుభూతి కలిగేలా చేసింది. నాన్న అంటూ తిరిగి, ఈరోజు ఆయన ఆపదలో ఉన్నప్పుడు సహాయం అడిగితే తనూజ చేయలేదనే బాధ ప్రేక్షకుల్లో కలిగింది. ఫలితంగా ఆయన ఓటింగ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఆయన తర్వాత ఐదవ స్థానం లో రీతూ చౌదరి కొనసాగుతుండగా, ఆరవ స్థానం లో సంజన, 7వ స్థానం లో సుమన్ శెట్టి కొనసాగుతున్నారు. గత వారాల్లో సుమన్ శెట్టి టాప్ 3 స్థానాల్లో ఉండేవాడు. కానీ ఆయన ఓటింగ్ ఒక్కసారిగా ఈ రేంజ్ లో డౌన్ అయిపోవడం గమనార్హం. ఇక చివరి మూడు స్థానాల్లో దివ్య, గౌరవ్, నిఖిల్ వంటి వారు కొనసాగుతున్నారు. ఈ ముగ్గురిలోనే ఎలిమినేషన్ ఉండనుంది.