Bigg Boss 9 Telugu: ఈ బిగ్ బాస్ సీజన్(Bigg Boss 9 Telugu) మొత్తం తనూజ చుట్టూనే తిరుగుతోంది. అసలు ఈ సీజన్ ని ఆమె కోసమే ప్లాన్ చేశారా అనే అనుమానం వచ్చే రేంజ్ లో అందరినీ డామినేట్ చేస్తూ ముందుకు వెళ్తోంది. ఆమె ఇంట్లోకి హౌస్ మేట్స్ అందరూ వచ్చినట్టు, వాళ్ళతో ఈమె వేగుతున్నట్టు గానే ఈ సీజన్ కొనసాగుతోంది. అంతే కాకుండా ఈ సీజన్ లో గొడవలు కూడా ఎక్కువ కాలం కొనసాగడం లేదు. నామినేషన్స్ సమయం లో పాత పగలు ఉన్నట్లు గా కొట్టుకుంటారు, కానీ నామినేషన్స్ పూర్తి అవ్వగానే జిగిరి దోస్తులు లాగా కలిసిపోతుంటారు. దీని వల్ల టీఆర్ఫీ రేటింగ్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా అంటే అది కూడా లేదు. బిగ్ బాస్ హిస్టరీ లోనే అత్యధిక రేటింగ్స్ తో ముందుకు సాగుతోంది. ఈ సీజన్ ఇప్పుడు దాదాపుగా చివరి దశకు చేరుకుంది, విన్నర్ ఎవరో, రన్నర్ ఎవరో కూడా ఒక క్లారిటీ వచ్చేసింది.
విన్నర్ గా కచ్చితంగా తనూజ నే నిలిచే అవకాశాలు ఉన్నాయి. రన్నర్ గా పవన్ కళ్యాణ్ నిలుస్తాడు. వీళ్లిద్దరి మధ్య భారీ గొడవలు ఉంటాయని ఆశిస్తే, ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా ముందుకు పోతున్నారు. పవన్ కళ్యాణ్ కి కూడా తనూజ తో ఉండడం వల్లే కంటెంట్ వస్తుంది. లేదంటే అసలు రాదనీ విశ్లేషకుల అభిప్రాయం. ఇదంతా పక్కన పెడితే ఈమధ్య కాలం లో తనూజ ఎక్కువ గా సుమన్ తో క్లోజ్ గా ఉంటూ ఉండడం మనమంతా చూస్తూనే ఉన్నాము. గత వారం కెప్టెన్సీ టాస్క్ లో కూడా ఆమె సుమన్ శెట్టి తరుపున నిలబడి పవన్ కళ్యాణ్ తో ఒక రేంజ్ లో పోరాడింది. ఇక నిన్నటి టాస్క్ లో కూడా ఆయనకు ఎంతో సహాయం చేసింది. కానీ చివరికి తనూజ కి అదంతా బ్యాడ్ అయ్యింది.
ఫ్యామిలీ వీక్ సందర్భంగా నిన్న సుమన్ శెట్టి భార్య హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరు కెప్టెన్ రూమ్ లో ఏకాంతంగా మాట్లాడుకుంటున్న సమయం లో సుమన్ శెట్టి కి ఆయన సతీమణి తనూజ తో దూరంగా ఉండమని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. తనూజ టాప్ లో ఉన్న వాళ్ళను వాడుకుంటుంది, ఈ క్రమం లో ఆమెనే హైలైట్ అవుతుందని ఆమె సుమన్ శెట్టి తో చెప్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. తనూజ అంత నిజాయితీగా సుమన్ శెట్టి తో ఉంటుంటే, ఇలా మాట్లాడడం అన్యాయం అని, మంచి గా ఉండడమే పాపం అయిపోయింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది తనూజ కి తెలిస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో?, సుమన్ శెట్టి కూడా నిన్నటి నుండి తనూజ తో కాస్త దూరం మైంటైన్ చేస్తున్నాడు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది.