Bigg Boss 9 Telugu Suman Shetty: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) గేమ్ లో కంటెస్టెంట్స్ ఓటింగ్ గ్రాఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. రోజురోజుకి వాళ్ళ ఆట తీరుని బట్టి మారిపోతూ ఉంటాయి. అందరి కంటే తక్కువ ఓటింగ్ వస్తాది, ఇతను కచ్చితంగా ఈ వారం లో ఎలిమినేట్ అయిపోతాడు అని అనుకున్న వాళ్ళు కచ్చితంగా ఒక్కోసారి ఎలిమినేట్ అవ్వరు. అనూహ్యంగా అలాంటి కంటెస్టెంట్స్ ఓటింగ్ భారీగా పెరిగిపోతూ ఉంటుంది. అలా ఈ సీజన్ లో సుమన్ శెట్టి ఒక్కసారిగా పైకి లేచాడు. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి సుమన్ శెట్టి చాలా సైలెంట్ గా ఉంటూ, ఎవ్వరితో పెద్దగా ఇంటరాక్షన్ లేకుండా ఉండేవాడు. హౌస్ లో అసలు ఇతను ఉన్నాడా లేదా అనే అనుమానం కలిగేది. ఈ వారం ఈయన నామినేషన్స్ లోకి రాకూడదు, వస్తే ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు అందరూ. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే సోషల్ మీడియా పోల్స్ అన్నిట్లో సుమన్ శెట్టి ఇప్పుడు రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు.
తనూజ మొదటి స్థానం లో కొనసాగుతుంది. సుమన్ శెట్టి కి ఎందుకు ఇంత ఓటింగ్ అంటే, ఆయన ఒకప్పుడు తెలుగు లో టాప్ మోస్ట్ కమెడియన్, తెలుగు వాళ్ళు ఆయనకు గట్టిగానే కనెక్ట్ అయ్యారు. అలా వాళ్ళ ద్వారా ఓటింగ్ వచ్చి ఉండొచ్చు. అంతే కాకుండా హౌస్ లో ఉన్నవారిలో సుమన్ శెట్టి చాలా మంచి వ్యక్తిగా అనిపించాడు. అంతే కాకుండా నామినేషన్స్ ప్రక్రియ లో సంజన గల్రాని కి సైలెంట్ గా కౌంటర్ ఇవ్వడం, వాష్ రూమ్ లో కూర్చొని చిన్న పిల్లవాడిలాగా రూమ్ స్ప్రే తో ఆదుకోవడం, అదే విధంగా టాస్కు వచ్చినప్పుడు ఫ్లోరా షైనీ ని ఓడించి సుత్తి ని చేతిలో పెట్టుకొని నామినేట్ చేయడం వంటివి ఆడియన్స్ కి బాగా నచ్చింది. అందుకే ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా అలా పెరిగిపోయింది.
ఇకపోతే మొదటి రోజు నుండి హౌస్ మేట్స్ తో పాటు, ఆడియెన్ కి కూడా చిరాకు కలిగించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సంజన గల్రాని నే. ఈమె కచ్చితంగా ఎలిమినేట్ అవ్వాలని కోరుకున్నారు కానీ, ఆమె ఈ వారం అవ్వడం లేదు. సోషల్ మీడియా ఓటింగ్ ఆమెకు బాగానే ఉంది. డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే ప్రస్తుతానికి శ్రేష్టి వర్మ నే. ఈమె ఇప్పుడు చివరి స్థానం లో ఉంది. ఈమెకు ముందు ఫ్లోరా షైనీ కూడా ఉంది. ఈమె కూడా ఎలిమినేట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి కానీ, శ్రేష్టి తో పోలిస్తే తక్కువ. ఇక మూడవ స్థానం లో ఇమ్మానుయేల్ కొనసాగవుతున్నాడు. రాబోయే రోజుల్లో ఈ గ్రాఫ్ మళ్లీ మారే అవకాశాలు ఉన్నాయి.