Bigg Boss 9 Telugu Sanjana: నిన్నటి బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) ఎపిసోడ్ ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్ని బిగ్ బాస్ ఎపిసోడ్స్ లో ది బెస్ట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. కాసేపు ఎమోషన్, కాసేపు ఫన్ అన్నట్టు సాగింది. ఈ ఎపిసోడ్ కి హైలైట్ గా నిల్చింది ఎవరైనా ఉన్నారా అంటే అది సంజన నే. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ, కొంతమంది హౌస్ మేట్స్ ఓటింగ్ తో ఆమెని బయటకు పంపేసినట్టు హౌస్ మేట్స్ ని నమ్మించారు. కానీ ఆమెని హౌస్ లోని ఒక సీక్రెట్ రూమ్ లో ఉంచినట్టు మన అందరికీ చూపించారు. పక్క రోజు స్టేజి మీదకు తీసుకొచ్చి, సంజన ఎలిమినేట్ అయిపోయింది, ఆమె మళ్లీ హౌస్ లోకి రావాలంటే రీతూ జుట్టు కత్తిరించుకోవాలి, ఇమ్మానుయేల్ తన కెప్టెన్సీ ని వదిలేయాలి, తనూజ కాఫీ మానేయాలి, భరణి తన సీక్రెట్ బాక్స్ ని ఓపెన్ చేసి చూపించాలి అంటాడు నాగార్జున.
అందుకు వాళ్లంతా ఒప్పుకుంటారు కూడా. ఇక వీళ్ళతో చక్కగా నడుచుకుంటుంది, వాళ్ళు ఆ రేంజ్ లో త్యాగాలు చేసి ఈమెని హౌస్ లోపలకు తీసుకొచ్చారు కాబట్టి, ఇక నుండి అయినా ఈమె దొంగతనాలు మానేస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి లేదు. హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆమె దొంగతనాలు చేసింది. ఈ విషయం పై హౌస్ లో పెద్ద రచ్చ జరిగిందట. అంతే కాదు ఆమె మెడలో దొంగలున్నారు జాగ్రత అనే పెద్ద బోర్డు కూడా తగిలించారట. అదే విధంగా నిన్న స్టేజి పై ఆమె మాస్క్ మ్యాన్ హరీష్ పై చేసిన కామెంట్స్ పై కూడా నామినేషన్స్ లో పెద్ద చర్చకు దారి తీసింది అంట. హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచినప్పటి నుండి ఆమె హరీష్, రాము, డిమోన్ పవన్ లకు చుక్కలు చూపించడం మొదలు పెట్టిందని, మళ్లీ గేమ్ ఈమె కారణంగా రసవత్తరంగా మారిందని అంటున్నారు విశ్లేషకులు.