Bigg Boss 9 Telugu Priya Shetty Elimination: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి ‘అగ్ని పరీక్ష’ షో ద్వారా ఆడియన్స్ ఓటింగ్ తో హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ ప్రియ శెట్టి(Priya shetty). అగ్నిపరీక్ష షో లో ఉన్నప్పుడు ఈమెకు మంచి క్రేజ్ ఉండేది. చూసేందుకు అమ్మాయి చాలా చక్కగా ఉంది, బాగా మాట్లాడుతుంది,టాస్కులు కూడా అదరగొడుతుంది అని సోషల్ మీడియా లో అనుకునేవారు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి ఈమె అడుగుపెట్టిందో, అప్పటి నుండి ఈమెకు తీవ్రమైన నెగిటివిటీ ఎదురైంది. హౌస్ లో యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి లాగా ప్రవర్తిస్తూ, చాలా బలుపు చూపించడం ఆడియన్స్ కి ఏ మాత్రం నచ్చలేదు. ఫలితంగా ఈమెని ఎలిమినేట్ చెయ్యాలంటూ పెద్ద ఎత్తున క్యాంపైన్స్ కూడా రన్ చేశారు. బయటకు వచ్చి చూసుకున్న తర్వాత నా మీద ఇంత నెగిటివిటీ ఏర్పడిందా అని ప్రియ కూడా ఆశ్చర్యపోవడం పక్కా.
అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో ఈమె ఎలిమినేట్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ప్రియ మరియు పవన్ కళ్యాణ్ లకు ఆడియన్స్ నుండి చాలా తక్కువ ఓటింగ్ పడిందట. వీళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్ సేవ్ అయ్యి ప్రియ ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తుంది. హౌస్ లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పిలవబడే ప్రియ ఎలిమినేట్ అవ్వడం నిజంగా బిగ్ బాస్ గేమ్ కి మంచిది కాదు. ఇలాంటోళ్ళు కచ్చితంగా హౌస్ లో ఉండాలి, లేకపోతే కావాల్సిన కంటెంట్ దొరకదు. పవన్ కళ్యాణ్, ఫ్లోరా షైనీ వల్ల ఎలాంటి కంటెంట్ రావడం లేదు. వీళ్ళు హౌస్ లో ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే, పెద్ద తేడా ఏమి ఉండదు. మొదటి వారమే ఎలిమినేట్ అయిపోతుందని అనుకున్న ఈమె, మూడవ వారం కూడా సేవ్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈమెని బిగ్ బాస్ టీం సేవ్ చేస్తుందా?, లేకపోతే నిజంగానే ఆడియన్స్ సేవ్ చేస్తున్నారా అనేది అర్థం కావడం లేదు.
ఏది ఏమైనా ప్రియ ఎలిమినేషన్ న్యాయం కాదని సోషల్ మీడియా లో కొంతమంది అభిప్రాయపడుతుంటే, మరికొంతమంది మాత్రం అబ్బా..దరిద్రం వదిలిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే మూడు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ప్రియ శెట్టి 2 లక్షల 40 వేల రూపాయిలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే వారానికి 80 వేల రూపాయిలు అన్నమాట. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే నాకొద్దు, సినిమాల్లోకి వెళ్లాలని ఉంది అంటూ తల్లిదండ్రులతో పోట్లాడి మరి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రియ, ఈ షో ద్వారా తన టార్గెట్ ని చేరుకుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఈమెకు వరుసగా అవకాశాలు వస్తే ఈమె అదృష్టం మామూలుగా లేదని అనుకోవచ్చు. చూడాలి మరి ఏమి జారబోతుందో.