Koratala Siva NTR: మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్… తన డాన్సులతో, ఫైట్లతో యావత్ ఇండియన్ ప్రేక్షకులందరిని మెప్పించాడు.గతేడాది దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాడు. 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టింది. మొదట్లో ఈ మూవీ 1000 కోట్లకు పైన కలెక్షన్లను తీసుకొచ్చి పెడుతుంది అంటూ సినిమా మేకర్స్ కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేసినప్పటికి సినిమా భారీ వసూలున్నైతే రాబట్టలేకపోయింది… ఇక మొదటి నుంచి ‘దేవర 2’ సినిమా ఉంటుందని ప్రచారం చేసున్నప్పటికి దేవర రిజల్ట్ అనుకున్న స్థాయిలో రాకపోవడంతో దేవర 2 ప్రాజెక్టు అటకెక్కినట్టేనని అందరు అనుకున్నారు. కానీ సెప్టెంబర్ 27వ తేదీకి దేవర రిలీజ్ అయి వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా దేవర 2 పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. దాంతో దేవర 2 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందంటూ ప్రచారం అయితే సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చేస్తున్న ‘డ్రాగన్’ మూవీ పూర్తి అయిన వెంటనే దేవర సినిమా కోసం తన డేట్స్ కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ‘ మహా శివరాత్రి ‘ రోజు స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఈ సంవత్సరం ఇప్పటికే ‘వార్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేకపోయాడు.
వరుసగా ఏడు విజయాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఆయన ‘వార్ 2’ సినిమాతో కొంతవరకు ఢీలా పడ్డాడు. దాంతో బాలీవుడ్లో సైతం ఆయన మార్కెట్ భారీగా పడిపోయింది. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో రాబోతున్న సినిమాతోనే ఆయన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. లేకపోతే ఆయన మార్కెట్ మరింత పడిపోయే అవకాశాలైతే ఉన్నాయని యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా అభిప్రాయ పడుతుండటం విశేషం…
18 సంవత్సరాల వయసులోనే హీరోగా మారిన ఆయన ఆ తర్వాత తన ఏజ్ కి మించిన పాత్రలు చేశాడు. సక్సెసులైతే దక్కాయి. కానీ ఆ తర్వాత ఆయన ఎలాంటి పాత్రలు చేయాలి ప్రేక్షకులు తన నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది తెలియక ఒక డైలమాలో పడిపోయి దాదాపు 5 సంవత్సరాల పాటు ఒక్క సక్సెస్ లేకుండా కెరీర్ ని లాగించాడు.
మొత్తానికైతే రాజమౌళి రంగంలోకి దిగి యమదొంగ సినిమాతో మరో సక్సెస్ ని సాధించి పెట్టిన తర్వాత అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా మంచి విజయాలను సాధిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కథ సెలక్షన్ బాగున్నప్పటికి ఆయన నుంచి వచ్చే సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ గా మారలేకపోతున్నాయి. కారణం ఏదైనా కూడా తనను తాను టైర్ వన్ హీరోగా మరోసారి ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఇండస్ట్రీ హిట్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది.