Bigg Boss 9 Telugu Ramu Rathod: టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటీ ని సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ఏకైక రియాల్టీ షో బిగ్ బాస్… ప్రస్తుతం 9వ సీజన్ స్టార్ట్ అయింది. ఇక ఈ సీజన్ లో 15 మంది కంటెస్టెంట్లు వాళ్ల సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లను సక్సెస్ ఫుల్ గా చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఈ సీజన్ లో సెలబ్రిటీస్ తో పాటు కామనర్స్ కూడా పాల్గొన్నారు…ఇక కామనర్స్ ని ఆ ఇంటికి ఓనర్స్ గా, సెలబ్రిటీలను టెనెట్స్ గా ఉండాలని బిగ్ బాస్ నిర్ణయించాడు. ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళు వాళ్ళ పనులను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే బిగ్ బాస్ మూడోవ ఎపిసోడ్లో శ్రష్టి వర్మ, సంజన ఇద్దరు కలిసి తింటుంటే శ్రీజ ప్రియ తో వాళ్ల దగ్గరికి వెళ్లి మనకు కూడా పెట్టమని అడుగుదాం పద అని అంటుంది. అప్పటికి ప్రియ నన్ను బుక్ అవుదమా పద అని శ్రీజ తో కలిసి ప్రియా వెళ్ళింది. ఇక టెనెట్స్ అయిన సంజన, శ్రష్టి వర్మ దగ్గరికి వెళ్లి మీరు తినేది మాకు ఇవ్వండి అని అడిగారు. దాంతో రాము రాథోడ్ అలా ఇస్తే మనం బుక్ అయిపోతాం అంటూ చెప్పడంతో శ్రష్టీ వర్మ వాళ్లకు ఇవ్వాల్సింది ఆపేసింది. దాంతో ప్రియా రాము రాథోడ్ మీద ఫైర్ అయింది. వాళ్ళు మాకు ఇవ్వాల్సింది మీరు ఎందుకు ఆపారు, మేము ఓనర్స్ మేము చెప్పినట్టు మీరు చేయాలి అంటు ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నం అయితే చేసింది… ఇక తనకు సపోర్ట్ గా మనీష్ కూడా వచ్చాడు.
Also Read: మీర్ ఖాన్ అంటే పడని రాజమౌళి ఆ సిరీస్ లో అతనితో కలిసి నటించడానికి కారణం ఏంటంటే..?
రాము రాథోడ్ మాత్రం చాలా పద్ధతిగా మీది మీకు ఉంది కదా మీరు తినడమ్మ మళ్లీ బిగ్ బాస్ దృష్టిలో మేము బ్యాడ్ అయిపోతామని చెప్పినప్పటికి ప్రియా మాత్రం పట్టించుకోవడం లేదు. ఎంత సేపు తన వాదన తనే చెబుతుంది తప్ప రాము రాథోడ్ ను అసలు పట్టించుకోవడం లేదు.
దీని మీద కొంతమంది ప్రేక్షకులు సైతం ప్రియా చేసిన తప్పు కి రామ్ రాథోడ్ బలి అయిపోయాడు అంటూ చాలావరకు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. రాము రాథోడ్ జెన్యూన్ గా తన గేమ్ ని ఆడుతుంటే తనని ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మరి కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండడం విశేషం…
ఇక మొత్తానికి అయితే ప్రియా చేసిన రామ్ రాథోడ్ బుక్ అయ్యాడనే చెప్పాలి. మరి బిగ్ బాస్ దీనిమీద ఎలా స్పందిస్తాడు. నాగార్జున దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆయన మాట్లాడే అవకాశం ఉందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరో రెండు రోజులపాటు వెయిట్ చేయాల్సిందే…