Bigg Boss 9 Telugu Ramu Rathod Elimination: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో రాము రాథోడ్(Ramu Rathod) కచ్చితంగా ఉంటాడు. టాస్కులు ఆడే విషయం లో కానీ, తోటి కంటెస్టెంట్స్ తో కలివిడిగా నడుచుకునే విధానం లో కానీ, ఎంటర్టైన్మెంట్ ని అందించడం లో కానీ, ఆడియన్స్ రాము ని తోపు కంటెస్టెంట్ గా చూస్తుంటారు. గత రెండు మూడు వారాల నుండి రాము తన కుటుంబాన్ని బాగా మిస్ అవుతున్నాడు. వాస్తవానికి రాము రెండవ వారం లోనే తన కుటుంబాన్ని తలుచుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ హౌస్ లో భరణి అన్న, తనూజ అక్క కారణంగా నాకు ఇప్పుడు మా అమ్మానాన్నలు గుర్తు రావడం లేదని చెప్పేవాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు వేళ్లతోనే ఎక్కువగా రాము ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆయన బాగా ఎమోషనల్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది.
ఈ వారం మొత్తం హౌస్ నుండి వెళ్ళిపోతాను అంటూ తనూజ తో, భరణి తో, ఇమ్మానుయేల్ తో చెప్పుకొస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ లో తన కుటుంబం హౌస్ లోపలకు వస్తుంది, వాళ్ళని చూసిన తర్వాత నేను ఆగలేను, వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను అని ఒకసారి తనూజ తో అంటాడు. అంతే కాకుండా తాను నాగార్జున తో మాట్లాడలేనని, నువ్వే ఈ విషయం గురించి మాట్లాడి నన్ను బయటకు పంపమని తనూజ ని రిక్వెస్ట్ కూడా చేసుకున్నాడట. హౌస్ మేట్స్ అందరూ రాము లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. కానీ నేటి ఎపిసోడ్ లో ఆయన ఎలిమినేషన్ అయ్యాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కాసేపటి క్రితమే జరిగింది. మేమంతా రాము కి చెప్పి చూసాము, కానీ వాడు ఉండలేకపోయాడు సార్ అని హౌస్ మేట్స్ కూడా నాగార్జున తో చెప్పారట. నాగార్జున కూడా చాలాసేపటి వరకు రాము ని ఒప్పించి హౌస్ లో ఉండే ప్రయత్నం చేసాడట.
వాస్తవానికి ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసినా,చివరి నిమిషం లో సింగిల్ ఎలిమినేషన్ కి ఫిక్స్ చేశారట. సింగల్ ఎలిమినేషన్ అయితే డేంజర్ జోన్ లోకి రాము, సాయి శ్రీనివాస్ వస్తారు. రాము సేవ్ అవుతాడు, సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ రాము అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం కారణం గా బిగ్ బాస్ టీం తలపెట్టుకొని కూర్చున్నారట. ఇప్పుడు ఆదివారం ఎపిసోడ్ కి స్క్రిప్ట్ మొత్తం మార్చే పరిస్థితి ఏర్పడింది అట. వాస్తవానికి ఈ వారం చాలా పెద్ద గొడవలు జరిగాయి, వాటి గురించి శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కవర్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా ఇలా జరిగేలోపు ఇప్పుడు ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో పడ్డారట. ఇప్పుడు సెల్ఫ్ ఎలిమినేషన్ అవ్వడం తో తక్కువ ఓటింగ్ వచ్చిన కంటెస్టెంట్స్ లో ఒకరిని ఎలిమినేట్ చేస్తారా?, లేదా కాసేపు హై డ్రామా క్రియేట్ చేసి ఎలిమినేషన్ లేదని అంటారా అనేది తెలియాల్సి ఉంది.