Ram Charan: ఏడాది చివరకు వచ్చేసింది, IPL సరికొత్త సీజన్ కూడా వచ్చే ఏడాది మార్చ్ నుండి ప్రారంభం కాబోతోంది. ఈమేరకు BCCI ఆక్షన్స్ ని త్వరలోనే ప్రారంభించబోతోంది. ఈసారి ఎవరెవరు ఏ టీం కి వెళ్తారు, ఈ సీజన్ లో ధోని ఆడుతాడా లేదా?, అసలు ఏమి జరగబోతోంది? అనే ఉత్కంఠ ప్రతీ క్రికెట్ లవర్ లో ఉండడం సహజమే. అయితే ఈసారి IPL లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా భాగం కాబోతున్నాడు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?. రామ్ చరణ్ కి IPL కి సంబంధం ఏంటి?, ఆయన కూడా షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా లాగా ఏదైనా టీం ని కొనుగోలు చేయబోతున్నాడా? అనే సందేహాలు మీ అందరికీ రావొచ్చు. గతం లో ఆయన వైజాగ్ IPL టీం ని ఏర్పాటు చేయబోతున్నాడనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగాయి.
కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఆ తర్వాత తెలిసింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అది ఏమిటంటే, త్వరలోనే రామ్ చరణ్(Global star Ram Charan), ధోని, కోహ్లీ మరియు రోహిత్ శర్మ వంటి వారు కలిసి ఒక కమర్షియల్ యాడ్ లో కనిపించబోతున్నారట. వీరంతా IPL కి సంబంధించిన యాడ్ లోనే నటించబోతున్నారని టాక్. మరి రామ్ చరణ్ తెలుగోడు కాబట్టి, ఆయన SRH తరుపున కనిపిస్తాడని తెలుస్తుంది. కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు, ఈ యాడ్ వీడియో లో ఇతర భాషలకు సంబందించిన హీరోలు కూడా కనిపిస్తారట. ఇదే కనుక నిజమైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో గర్వించొచ్చు. ఎందుకంటే IPL మ్యాచ్ ప్రతీ బ్రేక్ టైం లో రామ్ చరణ్ కి సంబంధించిన ఈ యాడ్ ప్రదర్శితం అవుతూ ఉంటుంది.
ఇప్పటికే గ్లోబల్ లెవెల్ లో మంచి రీచ్ ఉన్న రామ్ చరణ్, ఈ యాడ్ వీడియో ద్వారా ఇంకా గట్టిగా రీచ్ అవుతాడని అంటున్నారు ఫ్యాన్స్. ఈ ప్రమోషనల్ యాడ్ వీడియో కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చ్ 27 న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి, ‘చికిరి చికిరి’ వీడియో సాంగ్ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో రెండు మూడు ప్రమోషనల్ కంటెంట్స్ పేలితే సినిమా మీద ఎవ్వరూ ఊహించని రేంజ్ అంచనాలు ఏర్పడుతాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.