Bigg Boss 9 Telugu ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఎప్పుడూ జరగని సంఘటనలు, ఊహకందని ట్విస్టులు ఎదురు అవుతున్నాయి. లోపల ఉన్న హౌస్ మేట్స్ కి మాత్రమే కాదు,చూసే ఆడియన్స్ పై కూడా తీవ్రమయిన ఒత్తిడి పడుతోంది. వీకెండ్ ఎపిసోడ్స్ వచ్చిందంటే చాలు, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే దానిపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంటుంది. ఇంతకు ముందు అయితే సోషల్ మీడియా లో వచ్చే ఓటింగ్ ని బట్టి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆడియన్స్ కి ముందే అర్థం అయ్యేది. కానీ ఇప్పుడు హౌస్ లో ఒక్కొక్కరి చేతుల్లో ఒక్కో అస్త్రా ఉండడంతో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది చెప్పలేకపోతున్నారు ఆడియన్స్. ఈ వారం జరిగిన ఓటింగ్ ప్రకారం అయితే సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవ్వాలి. కానీ ఆయనకు బదులుగా రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇది సెల్ఫ్ ఎలిమినేషన్ అట.
ఇక ఆదివారం ఎపిసోడ్ లో ఎవరైనా ఎలిమినేట్ అవ్వబోతున్నారా?, లేదా ఈ వారానికి రాము ఎలిమినేషన్ తో సరిపెడుతారా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ షో కి వచ్చిన ఆడియన్స్ ని నాగార్జున మీ లెక్క ప్రకారం టాప్ 6 కంటెస్టెంట్స్ ఎవరు అని అడగ్గా, ఆడియన్స్ సుమన్ శెట్టి ని మొదటి స్థానంలో, ఇమ్మానుయేల్ ని రెండవ స్థానంలో, తనూజ ని మూడవ స్థానంలో, పవన్ కళ్యాణ్ ని నాల్గవ స్థానంలో, రీతూ చౌదరి ని 5వ స్థానంలో, డిమోన్ పవన్ ని ఆరవ స్థానంలో పెట్టారట. వీళ్లకు నాగార్జున ఒక్కో పవర్ ఇస్తాడని సమాచారం. విచిత్రం ఏమిటంటే భరణి ని ఒక్కరు కూడా టాప్ 6 లో పెట్టలేదట, ఇది ఆయనకు ఊహించని షాక్ అని చెప్పొచ్చు. ఇక టాప్ 6 కంటెస్టెంట్స్ కి నాగార్జున ఇచ్చిన పవర్స్ ఏమిటంటే, సుమన్ శెట్టి కి వచ్చే వారం కెప్టెన్సీ కంటెండర్ షిప్ డైరెక్ట్ గా ఇచ్చేస్తాను, కానీ అందుకు భరణి కుటుంబం ఫ్యామిలీ వీక్ కి హౌస్ లోకి రారు అని అంటాడట.
అందుకు సుమన్ శెట్టి ఒప్పుకోడు. ఇక ఇమ్మానుయేల్ కి తన ప్రేయసి నుండి వాయిస్ మెసేజ్ వస్తుంది, దాని కోసం గౌరవ్ వద్ద ఉన్న బ్లెస్సింగ్ పవర్ ని తిరిగి ఇచేయాల్సి వస్తుంది అని అంటాడట, అందుకు ఇమ్మానుయేల్ కూడా ఒప్పుకోడట. ఇక మూడవ స్థానం లో ఉన్న తనూజ కు తన చెల్లి పెళ్లి సందర్భంగా, ఆమె నుండి వాయిస్ నోట్ వస్తుంది, కానీ అందుకోసం పవన్ కళ్యాణ్ ఫినాలే వారం వరకు నామినేట్ అవ్వాలి అని అంటాడట. అందుకు తనూజ ఒప్పుకోదు, కనీసం రెండు వారాలు అయినా నామినేషన్ లో ఉండనివ్వు అని నాగార్జున అనగా, అందుకు కూడా ఆమె ఒప్పుకోడట. ఇక మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ కి ఎలాంటి పవర్స్ వచ్చాయో నేటి ఎపిసోడ్ ని చూసి తెలుసుకోవాలి.