Bigg Boss 9 Agnipareeksha Promo: మాస్క్ మ్యాన్..ఈ పేరు బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) కి సంబంధించిన ‘అగ్నిపరీక్ష'(Agnipareeksha) అనే ప్రోగ్రాం మొదలైనప్పటి నుండి మనమంతా వింటూనే ఉన్నాం. ఈ షోని సామాన్యులను ఎంపిక చేసే ప్రక్రియ కోసం ఏర్పాటు చేశారు. కేవలం వేలమందిలో కేవలం 15 మంది మిగిలారు. ఆ 15 మందిలో ఈ మాస్క్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లేందుకు ఎంపిక అయ్యాడట. కాసేపటి క్రితమే ఈ షో కి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలైంది. ఇందులో మాస్క్ మ్యాన్ జడ్జీలతో పొగరుగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇలాంటి వ్యక్తి హౌస్ లో ఉంటే మొదటి రోజు నుండే గొడవలు తారాస్థాయిలో ఉంటాయి. ఇతని వాలకం చూస్తుంటే హోస్ట్ నాగార్జున మీద కూడా ఫైర్ అయ్యేలా ఉన్నాడు. ఒకసారి ఈ ప్రోమోలో ఏముందో చూద్దాం పదండి.
Also Read: బిగ్ బాస్ 9 లో బాలయ్య బాబు హీరోయిన్ కి చోటు దక్కిందట…ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..?
ముందుగా నీ పేరేంటి అని అభిజీత్ అడగ్గా ‘అసలు పేరు హరీష్..సోల్ పేరు హృదయ్ మానవ్’ అని అంటాడు. అప్పుడు బిందు మాధవి ‘హృదయ్ మానవ్ అంటే ఏంటి?’ అని అడగ్గా, దానికి ఆయన హృదయం ఉన్న మానవుడు అని అంటాడు. అప్పుడు నవదీప్ ‘అనే మేమంతా హృదయం లేని వాళ్ళం అని అనుకుంటున్నావా?’ అని అడగ్గా, దానికి మాస్క్ మ్యాన్ సమాధానం చెప్తూ ‘మీరు కావాలంటే ఏమైనా అనుకోవచ్చు..మీ ఇష్టం’ అని అంటాడు. ఇక్కడే ఈ మాస్క్ మ్యాన్ ఎంత తేడాగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అతన్ని ఎంచుకునే జడ్జీల దగ్గరే ఇలా ఉన్నాడంటే ఇక హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ తో ఎలా ప్రవర్తిస్తాడు. చిన్న తనం నుండి కోపిష్టి వాడట కోపం వస్తే కొట్టేస్తాడట. అంటే బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ సమయం లో ఇతను కంటెస్టెంట్స్ మీద దాడి చేస్తాడా?
Also Read: బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’కు ఎండ్ కార్డ్.. ఊహించని ట్విస్ట్.. ఏం జరిగిందంటే?
అలా చేస్తే బయటకి పంపిస్తారు అనేది బహుశా అతినికి తెలిసే ఉంటుంది, తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నాడంటే, బిగ్ బాస్ కి కంటెంట్ ఇచ్చే వాళ్ళు కావాలి కాబట్టి, ఆ బేసిస్ మీద తనని సెలెక్ట్ చేస్తారేమో అని ఈ మాస్క్ మ్యాన్ స్ట్రాటజీ అయ్యుండొచ్చు. ఇతని వల్ల హౌస్ లో అయితే చాలా సమస్యలే వస్తాయి. వీకెండ్ లో వాటిని నాగార్జున కచ్చితంగా ప్రశ్నిస్తాడు. ఆ సమయం లో ఇతను ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇందాక విడుదలైన ప్రోమో లో ఇతను మాట్లాడే బలుపు మాటలను చూసి జడ్జీలకు చిరాకు కలిగి ఎదో అన్నారు. నాకు అవకాశం ఇవ్వకపోయినా పర్వాలేదు, నా క్యారక్టర్ ని జడ్జ్ చేయొద్దు అన్నాడు. మరి వీకెండ్స్ లో నాగార్జున హద్దులు దాటితే కంటెస్టెంట్స్ ని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి, మరి ఈ మాస్క్ మ్యాన్ ఆయనతో కూడా ఇలాగే బలుపుతో మాట్లాడుతాడా?,లేదా తన ఒరిజినల్ కి మాస్క్ వేసి నటిస్తాడా అనేది చూడాలి.
