Bigg Boss 9 Telugu Mask Man: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో చాలా మిస్టీరియస్ గా , ఆడియన్స్ కి చిరాకు కలిగించేలా ఉన్నాడు. మొదటి రోజు చాలా బాగున్నాడు. అందరితో కలిసిపోయాడు, ఇమ్మానుయేల్ ఇంటి మొత్తాన్ని ఊడుస్తుంటే తన వంతు సహాయం అందించాడు, అతనితో మంచి రిలేషన్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇద్దరి మధ్య సరదా జోక్స్ వేసుకోవడం వంటివి కూడా మొదలు అయ్యాయి. ఇమ్మానుయేల్ ని రెడ్ ఫ్లవర్ అని అన్నప్పుడు, దానికి కౌంటర్ గా ఇమ్మానుయేల్ ‘గుండు అంకుల్’ అని అంటాడు. అలా అన్నందుకు ఈ మాస్క్ మ్యాన్ చేసిన ఓవర్ యాక్షన్ ఎలాంటిదో రెండు తెలుగు రాష్ట్రాలు చూసింది. అదే విధంగా అతను భరణి, ఇమ్మానుయేల్ ని ఆడవాళ్ళతో పోల్చి మాట్లాడిన మాటలను కూడా మొన్నటి ఎపిసోడ్ లో రెండు సార్లు వేసి మరీ చూపించారు. దెబ్బకి మాస్క్ మ్యాన్ మాస్క్ వీడిపోవడం తో ఇప్పుడు హౌస్ లో కొత్త డ్రామా మొదలు పెట్టాడు.
నాకోసం హౌస్ లో ఎవ్వరూ స్టాండ్ తీసుకోలేదు, ఇలాంటి మనుషులు మధ్య నేను ఉండలేను, నన్ను ఎలిమినేట్ చేయండి, నన్ను ఎలిమినేట్ చేసేంత వరకు నేను ఆహరం కూడా తీసుకోను అంటూ నిరాహార దీక్ష చేస్తాడు బిగ్ బాస్. దీంతో బిగ్ బాస్ ఇతన్ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు. అనంతరం రాము రాథోడ్ ని కన్ఫెషన్ రూమ్ కి తీసుకెళ్లి, హరీష్ బాగోగులు మొత్తం నువ్వే చూసుకోవాలి, నీదే బాధ్యత అని అంటాడు. దీంతో రాము రాథోడ్ హరీష్ పక్కనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సైలెంట్ గా ఉంటాడా అంటే అసలు ఉండడం లేదు ఈ మాస్క్ మ్యాన్. భరణి , తనూజ మరియు సంజన పై చాడీలు చెప్తూనే ఉన్నాడు రాము రాథోడ్ కి. ఆ సమయం లో అక్కడికి భరణి వచ్చి రెండు రోజుల నుండి మీరేమి తినట్లేదు అంటున్నారు, దయచేసి ఏదైనా తినండి అన్ని అంటాడు.
మాస్క్ మ్యాన్ అందుకు పర్లేదు నా సంగతి నేను చూసుకుంటా అని అంటాడు. కాసేపటికి శ్రీజా అన్నం తో అస్క్ మ్యాన్ వద్దకు వస్తుంది. దయచేసి అన్నం తినండి అని బ్రతిమిలాడితే, నేను మీలాంటోళ్ళు ఉన్న చోట అన్నం తినను, ఎలిమినేట్ అయ్యాకనే అన్నం తింటాను అని అంటాడు మాస్క్ మ్యాన్. రామ్ రాథోడ్ అతని చేత తినిపించే ప్రయత్నం చాలానే చేసాడు, కానీ మూర్ఖత్వం తో మాస్క్ మ్యాన్ తినలేదు. ఇక చివరికి పవన్ కళ్యాణ్ వచ్చి, చాలా సేపటి వరకు బ్రతిమిలాడి తినిపించే ప్రయత్నం చేసాడు, అయినప్పటికీ మాస్క్ మ్యాన్ తినలేదు. ఇంత మొండిగా, మూర్ఖత్వం తో ఉన్నాడు కాబట్టి, ఆయన్ని ఈ వారం లో బిగ్ బాస్ హౌస్ నుండి పంపే ప్రయత్నమే చేసేలా ఉంది బిగ్ బాస్ టీం. పైగా ఇతనికి ఆడియన్స్ ఓటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది.