Bigg Boss 9 Telugu: ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో చాలా పెద్ద చర్చలు అయితే నడుస్తున్నాయి. ఓనర్స్ కి టెనెంట్స్ కి మధ్య జరుగుతున్న పోరు లో ఎవరు ఎవరిని డామినేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు అనేది తెలియాలంటే వీకెండ్ రావాల్సిందే. ఇక నాగార్జున గారు వచ్చి ఈ వారంలో జరిగిన వ్యవహారంలో ఎవరిది తప్పు ఎవరు ఎవరిని ఉద్దేశించి ఎలా మాట్లాడారు అనే విషయాల మీద క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే 4వ ఎపిసోడ్ లో గుడ్డు గురించి చాలా పెద్ద చర్చలైతే జరిగాయి. ఇక టెనెంట్స్ లో ఉన్న ఎవరో ఒకరు గుడ్డును దొంగలించారని ఓనర్స్ నానా రచ్చ అయితే చేశారు. ఇక దానికి తగ్గట్టుగానే రామ్ రాథోడ్ ను ఉద్దేశించి మీరంతా ఫేక్ ఇక మీ అందరికి గుడ్డు ఎవరు దొంగలించారో తెలిసినా కూడా చెప్పడం లేదు. మీలాంటి వాళ్లతో మాట్లాడటం వేస్ట్ అంటూ చాలా దురుసుగా సమాధానం చెప్పాడు. ఇక దానికి రాము రాథోడ్ సైతం సంజన గారు ఎగ్ తీసుకున్నారనే విషయం మీద నాకు సరైన క్లారిటీ లేదు ఆమె క్లారిటీగా మాకు చెప్పలేదు. మేము చూడలేదు దానివల్లే మేము ఆమె గుడ్డు దొంగలించిందని చెప్పలేకపోయాం బ్రదర్ అంటూ రామ్ రాథోడ్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ మనీష్ మాత్రం అతన్ని పట్టించుకోలేదు…
నిజానికి రాము రాథోడ్ మాత్రం చాలా ఇన్నోసెంట్ గా ఆడుతున్నాడు. ఎవ్వరి గొడవల్లో తను ఇన్వాల్వ్ అవ్వకుండా ఎవరితో పెద్దగా కనెక్ట్ అవ్వకుండా తన పని తాను చేసుకుంటూ, తన టాస్క్ లను తను సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నాడు. నిజానికి రాము రాథోడ్ చాలా జెన్యూన్ గా తన గేమ్ అయితే ఆడుతున్నాడు.
అలాంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఫేక్ అనడం కరెక్ట్ కాదు అంటూ మనీష్ మీద చాలామంది ప్రేక్షకులు సైతం మండిపడుతున్నారు. ఇక ఈ విషయంలో రాము రాథోడ్ కి జనాలు చాలా ఫేవర్ గా ఉన్నారు. తద్వారా ఆయనకు ఎక్కువ ఓటింగ్స్ పడే అవకాశాలైతే ఉన్నాయి. ఎవరైతే అనవసరంగా ఎదుటివారిని దూషిస్తారు వాళ్లకు భారీగా మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ప్రేక్షకులు అన్ని చూస్తున్నారు.
కాబట్టి డీసెంట్ గా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటూ ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ముందుకు సాగితే మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ముందుకు వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే మాత్రం మధ్యలోనే హౌస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి అయితే రావచ్చు…