Bigg Boss 9 Telugu: టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటీ ని సంపాదించుకున్న ఏకైక రియాల్టీ షో బిగ్ బాస్… ఇప్పటివరకు ఈ షో 8 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం 9వ సీజన్ స్టార్ట్ అయింది. ఇక దానికి సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సీజన్లో ఓనర్స్ హ టెనెంట్స్ అంటూ సెలబ్రిటీస్ ని కామనర్స్ ని సెపరేట్ చేసి షో అయితే రన్ చేస్తున్నారు. మరి దీనివల్ల షో చూసే ప్రేక్షకులకు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుందని చాలామంది కామెంట్స్ చేస్తుండడం విశేషం… ఇక నాలుగో రోజు ఓనర్స్ – టెనెంట్స్ మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగింది… ఇక సంజన తెలిసి చేస్తుందో తెలియకుండా చేస్తుందో కానీ నాలుగు రోజుల నుంచి ఆమె టాపికే నడుస్తోంది. కావాలనే టెనెంట్స్ అందరిని ఇరికిస్తున్నట్టుగా అనిపిస్తుంది…ఆమె చేసే ప్రతి పని వెనకాల ఏదో ఒక ఇబ్బంది అయితే కలుగుతోంది. ఆమె అనుకోని చేస్తుందా? లేదంటే యాదృచ్ఛికంగా జరిగిపోతుందా అనే విషయం పక్కన పెడితే మొత్తానికైతే ఆమెకు జరగాల్సిన నష్టం అయితే జరుగుతోంది.
ఇక కొన్ని సందర్భాల్లో ఆమె తనతో పాటుగా తన వెంట ఉన్న టెనెంట్స్ ను కూడా రిస్క్ లో అయితే పెడుతోంది. నాల్గోవ ఎపిసోడ్ లో జరిగిన దొంగతనం విషయంలో ఆమెది చాలావరకు తప్పు ఉన్నప్పటికి టెనెంట్స్ అందరు ఆమె తరపున సారీ చెప్పాల్సిన పరిస్థితి అయితే ఎదురైంది.
ఇక దానికి తోడుగా అందరు కావాలనే ఒక ఫేక్ గేమ్ ఆడుతున్నారు అనే ధోరణి లో ఓనర్స్ కి ఒక డౌట్ అయితే వచ్చింది. ఇక దాన్ని బేస్ చేసుకొని వాళ్ళను ట్రీట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక సంజన గుడ్డు దొంగలించింది అని తెలిసిన వెంటనే మనీష్ ఆమెను హౌస్ లోకి రాకండి అంటూ కరాకండిగా చెప్పేశాడు. దాంతో ఆమె హౌస్ బయట నిలబడి ప్రియా తో మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఎదురైంది.
మరి ఎందుకని సంజన ఇలాంటి ఒక స్ట్రాటజీని మెయింటెన్ చేస్తుంది ఆమెకు తెలియకుండా ఇలా చేస్తుందా? లేదంటే కావాలనే ప్రేక్షకులందరిలో తనమీద సింపతి రావాలని, దాన్ని వాడుకొని మరి ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుందా అని ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి….