Bigg Boss 9 Telugu : బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) ప్రేక్షుకులను ఎంతో ఉత్కంఠకు గురి చేసిన ‘అగ్ని పరీక్ష'(Agnipareeksha) షో నిన్నటితో ముగిసిపోయింది. ఎన్నో వేల అప్లికేషన్స్ నుండి, వివిధ రకాల టాస్కులను నిర్వహించి, కేవలం 13 మంది కంటెస్టెంట్స్ ని మాత్రమే ఫైనల్ చేశారు. వీళ్లంతా ఇప్పుడు ఓటింగ్ లైన్ లో ఉన్నారు. సోషల్ మీడియా లో ఆడియన్స్ ఓటింగ్ ద్వారా అయితే అందరికంటే అత్యధిక ఓట్లతో పడాలా పవన్ కళ్యాణ్ మరియు దమ్ము శ్రీజా కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ అనేది చెప్పడం ప్రస్తుతానికి కష్టమే. ఇద్దరికీ సరిసమానంగా ఓట్లు పడుతున్నాయి. వీళ్లిద్దరు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం. అదే విధంగా మాస్క్ మ్యాన్ హరీష్ కూడా హౌస్ లోపలకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ ముగ్గురి స్థానాలు పదిలంగా ఉన్నాయి. మిగిలిన మూడు స్థానాలకు చాలా బలమైన పోటీ నడుస్తుంది. అగ్నిపరీక్ష షోలో ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించిన వారిలో ఒకరు మర్యాద మనీష్.
చివరి ఎపిసోడ్ లో చివరి టాస్క్ విన్నర్ ఈయనే. ఈయనతో పాటు ప్రియా శెట్టి, డిమోన్ పవన్, నాగ ప్రశాంత్ మరియు దివ్య నిఖిత వంటి వారు కూడా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు. వీరిలో ముగ్గురికి హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ ముగ్గురు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. హౌస్ లోపలకు పంపే ప్రక్రియ రెండు పద్ధతుల్లో ఉంటుందట. ఒకటి ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా పంపడం, ఇంకోటి అగ్ని పరీక్ష జడ్జీల ద్వారా నేరుగా ఎంపికై బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం. అలా జడ్జీల ద్వారా ఎంపిక కాబడిన వారిలో నాగ ప్రశాంత్ కచ్చితంగా ఉంటాడని అంటున్నారు. అయితే బిగ్ బాస్ టీం గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజున ఒక షాకింగ్ ట్విస్ట్ ఆడియన్స్ కి ఇవ్వబోతున్నారట. ఇది ఎపిసోడ్ ఆరంభం లోనే ఉంటుందని సమాచారం.
వివరాల్లోకి వెళ్తే ‘అగ్నిపరీక్ష’ షో లో మిగిలిన 13 మంది కంటెస్టెంట్స్ సూట్ కేసులతో గ్రాండ్ లాంచ్ స్టేజి మీదకు పిలుస్తారట. అక్కడే సస్పెన్స్ మధ్య హౌస్ లోకి వెళ్ళేవాళ్ళను ఒక్కొక్కరిగా రెవీల్ చేస్తూ లోపలకు పంపుతారట. మరి ఈ 13 మందిలో ఏ ఆరు మంది లోపలకు వెళ్తారు?, వెనక్కి తిరిగి వెళ్లే 7 మంది ఎవరు అనేది ప్రేక్షకుల్లో ఉత్కంఠ ని కలిగించే విధంగా ఈ ప్రోగ్రాం ని డిజైన్ చేశారట. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. ఇకపోతే ఈ సీజన్ లో రెండు హౌస్ లు ఉన్నాయని మొదటి నుండి చెప్తూ వచ్చారు. ఆ రెండు విడివిడిగా ఉండవట. ఒకే హౌస్ లో సామాన్యులకు ఒక బెడ్ రూమ్, సెలబ్రిటీలకు ఒక బెడ్ రూమ్ లాగా ఉంటుందట. అన్ని సీజన్స్ లో లాగానే ఈ సీజన్ లో కూడా హౌస్ ని చాలా కలర్ ఫుల్ గా తీర్చిదిద్దారట. శనివారం రోజున గ్రాండ్ లాంచ్ కి సంబందించిన ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది.