Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో లో ఉన్నన్ని ట్విస్టులు ఏ సీజన్ లో కూడా లేవు అనడం లో ఎలాంటి సందేహం లేదు. బహుశా ఇతర భాషల్లో ఉన్న బిగ్ బాస్ సీజన్స్ లో కూడా అక్కడి ఆడియన్స్ ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మనం చూసినన్ని ట్విస్టులు చూసి ఉండరు. ఊహించని వైల్డ్ కార్డ్స్, ఊహించని రీ ఎంట్రీలు, ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఊహించని విధంగానే జరుగుతున్నాయి. ఇప్పుడు విజయవంతంగా ఈ సీజన్ 11 వారాలు పూర్తి చేసుకొని 12వ వారం లోకి అడుగుపెట్టింది. కాబట్టి వచ్చే వారం టాస్కులను వేరే లెవెల్ లో ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీం. వచ్చే వారమే చివరి కెప్టెన్సీ టాస్క్ జరిగింది. హౌస్ లో మొదటి నుండి ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కెప్టెన్సీ అయ్యారు. నిన్నటితో రీతూ చౌదరి కూడా కెప్టెన్ అయ్యింది.
ఇక భరణి ఒక్కడే మిగిలి ఉన్నాడు. వచ్చే వారం హౌస్ మేట్స్ ఆయనని కెప్టెన్ చేయడానికి సపోర్టు చేస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు అసలు ఆయనకు అనుకూలంగా లేవు, పైగా హౌస్ లో ఇప్పటి వరకు కంటెస్టెంట్స్ కి సొంతంగా ఆడి గెలుచుకునే టాస్కుల కంటే ఎక్కువగా సపోర్టింగ్ టాస్కులే ఉన్నాయి. కానీ చివరి కెప్టెన్సీ టాస్క్ సపోర్టింగ్ టాస్క్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వచ్చే వారం హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ ఫిజికల్ టాస్కులను పాత సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ తో ఆడాల్సి ఉంటుంది. మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ 4 కంటెస్టెంట్ గా నిల్చిన ప్రిన్స్ యావర్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడట. ఇతను హౌస్ లో ఒక కంటెస్టెంట్ ని ఎంచుకొని, వారితో తలపడనున్నాడు.
ఎవరైతే యావర్ ని ఓడిస్తారో, వాళ్ళు కెప్టెక్య్ కంటెండర్ అయ్యినట్టు. ఒకవేళ ఓడిపోతే మాత్రం కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పుకున్నట్టు లెక్క. ఇలా వారం మొత్తం లో రోజుకి ఒక పాత కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగుపెట్టి, ప్రస్తుత హౌస్ మేట్స్ తో తలపడుతారు. ప్రిన్స్ యావర్, ఆట సందీప్, పల్లవి ప్రశాంత్ మరియు అర్జున్ అంబటి వంటి వారితో వచ్చే వారం ఈ సీజన్ కంటెస్టెంట్స్ పోటీ పడనున్నారు. ఒక ఎపిసోడ్ కి గత సీజన్ టైటిల్ విన్నర్ నిఖిల్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట. అమర్ దీప్ ని కూడా అడిగారట కానీ, ఆయన చెయ్యి విరగడం తో రాలేకపోయాడని టాక్. చూడాలి మరి వచ్చే వారం బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ఏ రేంజ్ లో జరగబోతుంది అనేది.